పదవ తరగతి పరీక్షలను పకడ్బందిగా నిర్వహించాలి: జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్


పదవ  తరగతి పరీక్షలను పకడ్బందిగా నిర్వహించాలి

జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్


విశాఖపట్నం, ఏప్రిల్ 8:  ఈ నెలలో జరగనున్న పదవతరగతి  పరీక్షలను  ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని  జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం ఉదయం వారు పదవతరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశమందిరంలో   సమన్వయ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ పరీక్షలను  జిల్లాలోని 318 పాఠశాలలను పరీక్షా కేంద్రాలగా ఎంపిక చేయడం జరిగిందని,  ఇందులో 155 పాఠశాలలను విశాఖ జిల్లాలలోను,  122 పాఠశాలలను అనకాపల్లి జిల్లాలోను , 41 పాఠశాలలను  అల్లూరి సీతారామరాజు జిల్లాలోను  ఎంపిక చేయడం జరిగిందని  వీటిలో  మొత్తం 58,256 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరగుతారని తెలిపారు.  318 పరీక్షా కేంద్రాలలో 10 సమష్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటిలో  సి.సి కెమెరాలు ఏర్పాటు చేయుటకు  అధికారులను సూచించినారు.  జిల్లా అధికారులందరూ  సమన్వయంతో పని చేసి, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు చూడాలన్నారు. 10వ తరగతి పరీక్షలు  తేది 27-4-2022 నుండి 9-4-2022 వరకు జరుగుతాయన్నారు.  

పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, నిరంతర విద్యుత్తు ఉండేటట్లు చూడాలని ఆదేశించారు.  పరీక్ష సమయం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 నిల వరకు  ఆయా ప్రాంతాలలో 144 వ సెక్షన్ అమలులో ఉంటుందని మరియు  పరీక్షా కేంద్రాలలో  అనుమతి లేనిదే ప్రవేశించరాదని, అతిక్రమించిన వారికి చట్ట పరమైన చర్యలు తీసుకోబడునని తెలియజేసారు. ఏ ఒక్క విద్యార్ధి కూడా నేలపై పరీక్షలు వ్రాయరాదని అధికారులను ఆదేశించారు.  ఇదే విదంగా ఏప్రిల్ నెలలో జరగబోయే  సార్వత్రిక పది మరియు ఇంటర్ పరీక్షలను సజావుగా  నడిపించాలని  ఆదేశించారు.  

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి విజయకుమార్, మూడు జిల్లాల విద్యాశాఖాదికారులు, ఉప విద్యాశాఖాదికారులు, ప్రభుత్వ పరీక్షల సహయ కమిషనర్, విద్యుత్తు, వైద్య ఆరోగ్య, రవాణా, తపాలా , పోలీసు తదితర అధికారులు పాల్గొన్నారు. 


జారీః ఉపసంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్నం

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం