గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*

 

*సీతారాముల కళ్యాణం చూతము రారండి* 

 *గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు* 

రాజ్ భవన్ - విజయవాడ: తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహణలోని ఒంటిమిట్ట (కడప) శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో నిర్వహించే శ్రీరామనవమి భ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరించందన్ కు తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు స్వాగతం పలికారు. శుక్రవారం రాజ్ భవన్ కు వచ్చిన దేవస్ధానం అధికారులు, పండితులు గవర్నర్ కు ఆహ్వాన పత్రికను అందచేసి దేవాలయ చరిత్ర, వైభవాన్ని గురించి వివరించారు. ఈ నెల పదవతేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా, 19వ తేదీ వరకు జరగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్ధానం, ఒంటిమిట్ట రామాలయం ఉప కార్యనిర్వహణ అధికారి డాక్టర్ రాపూరి రమణ ప్రసాద్ తెలిపారు. పదిహేనవ తేదీన స్వామి వారి కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్టను ఏకశిలా నగరం కూడా పిలుస్తారని శతాబ్దాల నాటి ఈ దేవాలయంకు విచ్చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేదపండితులు గవర్నర్ ను ఆశీర్వదించి తీర్దప్రసాదాలు అందచేసారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, దేవస్దానం నుండి బివిఎల్ గోపాల్ అచార్య, ఎంవి శాస్త్రి, డి సాంబశివ శర్మ, దొరస్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Popular posts
" వ్యర్థం పై యుద్ధం " కార్యక్రమం లో అందరూ భాగస్వాములు కావాలి : జెడ్పి సీ.ఈ.ఓ. నాగార్జున సాగర్
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
Image
మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Image
నూతన మంత్రుల ప్రమాణ స్వీకారానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయండి : సిఎస్ సమీర్ శర్మ