జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన

 *విశాఖపట్నం జిల్లా (మాడుగుల)*


_*జీడిమామిడి తోటలు తొలగిస్తే... ఆత్మహత్యలే శరణ్యం*_


*జీడిమామిడి తోటలను తొలగిస్తే మాకు ఆత్మహత్యే దిక్కని మాడుగులలో మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.*


*- మామిడి కొమ్మలకు చీరలతో ఉరి వేసుకున్నట్లుగా వినూత్నంగా నిరసన తెలిపారు.*


*- తాము ఆక్రమణదారులం కాదని.. ప్రభుత్వమే భూములు ఇచ్చిందని స్పష్టం చేశారు.*


★ విశాఖ జిల్లా మాడుగుల రెవెన్యూ పరిధిలోని ఉరవకొండపై జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన


వ్యక్తం చేశారు. 


★ గురువారం మామిడి చెట్ల కొమ్మలకు చీరలతో ఉరి వేసుకున్నట్లు వినూత్నంగా నిరసన తెలిపారు.


★ _*"మేము ఆక్రమణదారులం కాదు. జీడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నాం. డీ పట్టా భూములను ప్రభుత్వమే ఇచ్చింది. ఎమ్మెల్యే, తహసీల్దారు గిరిజనులపై వివక్ష చూపడంతో భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి"*_ అని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.