*- భూముల ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం

 *అమరావతి*


_*కొత్త జిల్లాల్లో భూముల విలువ.. 75 శాతం వరకు పెంచిన సర్కార్*_


*కొత్త జిల్లాల్లో భూముల మార్కెట్‌ విలువలను ప్రభుత్వం భారీగా పెంచింది.*


*- ప్రాంతాన్ని బట్టి దాదాపు 75 శాతం మేర హెచ్చించింది.*


*- ఇది కొనుగోలుదారులకు తీవ్ర భారంగా మారనుంది.*


*- భూముల ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం జమకానుంది.*


★ రాష్ట్రంలోని 11 కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెంచిన మార్కెట్‌ విలువలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. 


★ కొత్త జిల్లాలు ఏర్పడిన రెండ్రోజుల్లోనే మార్కెట్‌ విలువలను ప్రభుత్వం పెంచేసింది. 


★ ఈ పెంపునకు ప్రత్యేక రివిజన్‌ అని పేరు పెట్టింది. 


★ జాతీయ రహదారులు, దుకాణాలు, సమీపంలో ఉన్న పరిశ్రమలు, ఇతర అంశాల ఆధారంగా మార్కెట్‌ విలువలను సవరించారు. 


★ దీంతో రిజిస్ట్రేషన్ల ఫీజుల రూపంలో రెవెన్యూ శాఖకు కోట్లాది రూపాయలు అదనంగా రానున్నాయి. 


★ సంప్రదాయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోనికి వచ్చే అవకాశం ఉంది. 


★ ప్రస్తుతం కొత్త జిల్లా కేంద్రాల్లో అక్కడి డిమాండ్‌ను బట్టి మార్కెట్‌ విలువల్లో 13 నుంచి 75 శాతం వరకు పెంచారు. 


★ బాపట్ల, నరసరావుపేట జిల్లాల్లో ఫిబ్రవరి 1 నుంచే సవరించిన మార్కెట్‌ విలువలు అమల్లోకి వచ్చాయి. 


★ తిరుపతి జిల్లాలో 4 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలోని 68 గ్రామాల్లో కొత్త రిజిస్ట్రేషన్‌ ధరలు అమల్లోకి వచ్చాయి. 


★ జిల్లా పరిధిలో కనిష్ఠంగా 20 నుంచి గరిష్ఠంగా 75మేర భూముల ధరలు పెంచారు.


★ రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో కొన్ని గ్రామాల్లో 432 శాతం మేరకు భూముల విలువ పెంచేందుకు సబ్‌రిజిస్ట్రార్‌ ఆనంద్‌రెడ్డి ప్రతిపాదనలు పంపించారు. 


★ అప్పటి కమిటీని పర్యవేక్షిస్తున్న జిల్లా సంయుక్త కలెక్టర్‌ వీటికి ఆమోదముద్ర వేశారు. 


★ పెంపును 75 శాతానికి కుదించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. 


★ ఈ మేరకు అధికారులు రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ ఆనంద్‌రెడ్డిని విలువలను తగ్గించి తిరిగి ఫైల్‌ తీసుకురావాలని చెప్పగా ఆయన నిరాకరించారు. 


★ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించినందున ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.


★ 75 శాతం కంటే ఎక్కువగా పెంచిన భూముల మార్కెట్‌ విలువలను తిరిగి తగ్గించారు.


★ *విజయవాడ* పటమట రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని పెదపులిపాకలో మార్కెట్‌ విలువలు 37.25 శాతం పెరిగాయి. 


★ కానూరులో 13 వేల 500 ఉన్న గజం మార్కెట్‌ విలువను 17వేలకు పెంచారు. 


★ బందరు రోడ్డు ఇరువైపులా గజం 96 వేల 400 ఉండగా ..దీన్ని లక్షా 10వేలకు పెంచారు. 


★ కొవ్వూరు పట్టణం ఔరంగాబాద్‌ ప్రాంతంలో ఇప్పటివరకు ఎకరం భూమి విలువ 35లక్షలు ఉంది. ఇప్పుడు ఈ పట్టణం తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లడం వల్ల...ఎకరం విలువ 42 లక్షలకు చేరింది. జిల్లా కేంద్రం రాజమహేంద్రవరానికి సమీపంలో ఉండడం వల్లే ఇంత పెరిగింది. 


★ రాజమహేంద్రవరం కోటగుమ్మం మెయిన్‌రోడ్డులో గజం స్థలం 76వేల నుంచి 86వేలకు పెరిగింది. దేవీచౌక్‌లో గజం 42వేల నుంచి 48వేలకు పెరిగింది. 


★ కొత్తగా ఏర్పడ్డ కోనసీమ జిల్లాలోనూ భూముల మార్కెట్‌ విలువలు పెరిగాయి. 


★ అమలాపురంలో గజం 18వేల నుంచి 22 వేల 500కు చేరాయి.


★ పేరూరులో 8వేల 500 నుంచి 12 వేల 500కు పెరిగింది.


★ భీమవరం, గునుపూడి, వీరవాసరం, ఉండి, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో 30 ప్రాంతాల్లో కొత్తగా భూముల విలువ పెంచారు. 


★ 20 శాతమే పెంచినట్లు అధికారులు చెబుతున్నా.. 25 నుంచి 30 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. 


★ అనకాపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని 76 ప్రాంతాల్లో 16 నుంచి 30 శాతం పెంచినట్లు చెబుతున్నా ... సంపతిపురం, ఊడేరులో 50 శాతం పెరుగుదల కనిపించింది.


★ తాళ్లపాలెంలో ఎకరా 26 లక్షలు ఉంటే ఇప్పుడు 33 లక్షలు చేశారు. 


★ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంతో పాటు పట్టణానికి ఆనుకొని ఉన్న 5 కిలోమీటర్లలోపు 6 గ్రామాల్లోనూ ధరలు పెరిగాయి. 


★ ప్రాంతాన్ని బట్టి సుమారు 25 నుంచి 30 శాతం పెంచారు. 


★ పార్వతీపురంతో పాటు కొమరాడ మండలం శివినిలోనూ ధరలను సవరించారు. 


★ ప్రధాన రహదారిలో గజం 18వేల నుంచి 26వేలకు....4 వేల 500 ఉన్నచోట 5వేల 8వందలకు... 6వేలు ఉన్న ప్రాంతంలో 8వేలకు పెంచారు.

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం