ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావడం ఎంతో గర్వించదగ్గ విషయం

 తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి దేవాలయం లో రాతి స్తంభాలు నిర్మాణంలో భాగస్వాములై తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారి తో సన్మానం అందుకున్నా  శ్రీ శ్రీ శ్రీ కాళికామాత దేవాలయ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ శిల్పి.దురగడ్డ రవీంద్రచారి. కుమారుడు శిల్పి దురగడ్డ. శేఖర్ఆచారి ని ఆళ్లగడ్డ పట్టణంలోని నంద్యాల రోడ్ లో శారద శిల్ప కళా మందిరం నందు వారిని కలిసి ప్రత్యేకంగా అభినందించి దుశ్శాలువతో సన్మానించిన కర్నూలు జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యదర్శి సహదేవ ఆచారి ఆత్మకూరు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని యాదాద్రి దేవాలయ నిర్మాణంలో భాగస్వాములై యావత్ విశ్వకర్మ సమాజానికి  మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావడం ఎంతో గర్వించదగ్గ విషయం అని అన్నారు. రాబోయే కాలంలో కూడా  దేవాలయల నిర్మాణంలో భాగస్వాములై రాష్ట్రానికి విశ్వకర్మ సమాజానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు అదేవిధంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలలో స్థపతులు గా  విశ్వబ్రాహ్మణ శిల్పుల ను నియమించాలని శిల్పులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో బాణాల గోపాల చారి. కె రామాచారి విశ్వకర్మ. తదితరులు పాల్గొన్నారు.