ముంబయిలో తొలి కేసును అధికారులు గుర్తించారు.

 *భారత్/మహారాష్ట్ర*


_*కరోనా కొత్త వేరియంట్​ 'ఒమిక్రాన్​ ఎక్స్​ఈ' భారత్​లోకి ప్రవేశించింది.*_


*ముంబయిలో తొలి కేసును అధికారులు గుర్తించారు.*


★ అయితే.. ఇది ఎక్స్​ఈ వేరియంట కాకపోవచ్చని ఇన్సాకాగ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.


★ కరోనా వైరస్​ ఒమిక్రాన్ రకం కన్నా 10శాతం వేగంగా వ్యాపించగల సరికొత్త వేరియంట్​ భారత్​లోనూ వెలుగుచూసింది.


★ 'ఒమిక్రాన్​ ఎక్స్​ఈ' రకం కరోనా వైరస్​ను ముంబయిలో గుర్తించినట్లు బృహన్​ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. 


★ మొత్తం 376 సాంపిల్స్​కు జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా.. ఒకరిలో ఎక్స్​ఈ, మరొకరిలో కప్పా వేరియంట్​ గుర్తించినట్లు వివరించారు. 


★ ఈ కొత్త వేరియంట్లు సోకిన రోగుల పరిస్థితి విషమంగా లేదని స్పష్టం చేశారు. 


★ ముంబయిలో తాము పరీక్షించిన 230 సాంపిల్స్​లో.. 228 కేసుల్లో ఒమిక్రాన్​గా తేలిందని ఆ అధికారి చెప్పారు.


★ భారత్​లో కొంతకాలంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోంది. 


★ ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 రకాల కలయికతో 'ఒమిక్రాన్​ ఎక్స్​ఈ' వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


★ బీఏ.2 రకంతో పోల్చితే ఒమిక్రాన్​ ఎక్స్​ఈ వేరియంట్​ 9.8శాతం అధికంగా వ్యాప్తి చెందే అవకాశముందని అంచనా వేశారు. 


★ ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇటీవల ఇదే విషయం చెప్పింది.


★ ముంబయిలోని సాంపిల్‌ ఎక్స్‌ఈ వేరియంట్‌కు చెందినదిగా ప్రస్తుత ఆధారాలు సూచించడంలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 


★ ఎక్స్‌ఈ వేరియంట్‌గా భావిస్తున్న సాంపిల్‌ ఫాస్ట్‌ క్యూ ఫైల్స్.. ఇన్‌సాకాగ్‌కు చెందిన జన్యు నిపుణులు క్షుణ్నంగా పరిశీలించినట్లు. 


★ ఆ సాంపిల్ జన్యుక్రమం ఎక్స్‌ఈ వేరియంట్‌ జన్యుచిత్రంతో సరిపోలడం లేదని ఆయా వర్గాలు వివరించాయి.

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం