ప్రభుత్వ తీరుతో... ప్రశ్నార్ధకంగా విజయవాడ ఆటోనగర్‌ మనుగడ*_


 *విజయవాడ (ఆటోనగర్)*


_*ప్రభుత్వ తీరుతో... ప్రశ్నార్ధకంగా విజయవాడ ఆటోనగర్‌ మనుగడ*_


*ఆసియాలోనే అతి పెద్దదిగా పేరొందిన విజయవాడ జవహర్‌ ఆటోనగర్‌ మనుగడ ప్రశ్నర్ధకంగా మారింది.*


*- ఆటోనగర్‌ను కమర్షియల్‌ ప్రాంతంగా పేర్కొంటూ... ప్రభుత్వం జీవోలు తేవడంపై కార్మికులు, వ్యాపారులు భగ్గుమంటున్నారు.*


*- మార్కెట్‌ విలువ ప్రకారం 50శాతం పన్ను రూపేణా వసూలుకు సిద్ధమవడాన్ని తప్పుపడుతున్నారు.*


★ దేశంలో ఏర్పాటైన తొలి ఆటోనగర్‌గా విజయవాడ జవహర్‌ ఆటోనగర్‌కు పేరు. 


★ ఆటో మొబైల్‌, వాహనాల విడిభాగాల తయారీ, అమ్మకాలకు ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. 


★ 1966లో బెజవాడ శివారులో పారిశ్రామిక ఎస్టేట్‌ పక్కన సుమారు 275ఎకరాల స్థలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. 


★ దీనిపై ఆధారపడి ఎంతో మంది జీవిస్తున్నారు.


★ లారీలు, బస్సులకు బాడీలు కట్టడంలో ఈ ప్రాంతానికి ఎంతో పేరుంది. 


★ ఛాసిస్ వాహనాన్ని తీసుకొచ్చి కార్మికులకు అప్పగిస్తే చాలు... యజమాని అభిరుచి మేరకు ఎలా కావాలంటే అలా బాడీలు కట్టి ఇస్తారు. 


★ రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశాకు చెందిన యజమానులు ఇక్కడికే వచ్చి లారీలకు బాడీలు కట్టించుకొని వెళ్తుంటారు. 


★ అంతగా ప్రసిద్ధి చెందిన ఆటోనగర్‌కు... ప్రభుత్వం జారీ చేసిన 5, 6 నంబరు జీవోలు గుదిబండగా మారాయి. 


★ ఆటోనగర్ పారిశ్రామికవాడను కమర్షియల్​గా మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని కార్మికులు, వ్యాపారులు తప్పుపడుతున్నారు.

_*పరిశ్రమలు తరలిపోతే రాష్ట్ర మనుగడకే ప్రమాదం..*_

★ 60వ దశకంలో తాము స్థలాలు ఉచితంగా పొందలేదని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు.

★ ఆటోనగర్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షకు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని చెబుతున్నారు. 

★ 50 శాతం పన్ను కట్టాలంటే ఇక వ్యాపారాలు వదులుకోవటమేనని అంటున్నారు.


★ చిన్న చిన్న పరిశ్రమలు ఉండే ప్రాంతాన్ని కమర్షియల్‌ చేస్తామంటే ఉపేక్షించేదే లేదని తేల్చిచెప్తున్నారు.

★ చిన్న పరిశ్రమలు నడుపుకునే వారు పెద్దమొత్తంలో పన్నులెలా కడతారని వ్యాపారులు నిలదీస్తున్నారు. 

★ పరిశ్రమలు తరలిపోతే రాష్ట్ర మనుగడకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

_*ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం..*_

★ ఆటోనగర్​కు ప్రస్తుతం వాహనాలు భారీ సంఖ్యలో వచ్చే పరిస్థితులు లేవని .. బతుకే కష్టంగా ఉన్న సమయంలో పన్నుల వాతలేంటని ప్రశ్నిస్తున్నారు. 

★ ఆటోనగర్‌ను ఆనుకుని ఉన్న కానూరు పారిశ్రామిక ప్రాంతాన్ని సొంతగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏపీఐఐసీకి సర్వీస్ ఛార్జీ రూపేణా రుసుము కడుతున్న విషయాన్ని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. 

★ 5, 6 జీవోలను ఉపసంహరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.