*వైసీపీ వీడి టీడీపీ లో 40 కుటుంబాలు చేరిక*
ప్రకాశంజిల్లా *బేస్తవారిపేట* పట్టణంలో వైసీపీ పార్టీని వీడి 40 కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జ్ *ముత్తుముల అశోక్ రెడ్డి* ఆధ్వర్యంలో వైసీపీ యూత్ అనుమల కిషోర్, మల్లెపు రవీంద్రా, దూదేకుల శ్యామ్, చెన్న విజయ్ తో పాటు 40 కుటుంబాలు టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజలు టిడిపి వైపు చూస్తున్నాయని అన్నారు. అలాగే రాష్ట్రం యువతకు ఉద్యోగ అవకాశాలు లేకా పక్కరాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి వచ్చిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేవని అప్పుడు యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేవని అన్నారు అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్న టీడీపీ అధికారంలో ఉంటేనే అవి జరుగుతాయని, వచ్చే ఎన్నికల్లో ఈప్రభుత్వానికి యువత తగిన బుద్ధి చెప్తానన్నారు.
ఈకార్యక్రమంలో మండల మరియు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.