నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని కరెంటు కష్టాలు

 *విశాఖపట్నం జిల్లా (నర్సీపట్నం)*

_*టార్చిలైట్ల వెలుగులో ప్రసవం... పసికందు సైతం అనుభవిస్తున్న కరెంటు కష్టాలు*_


*నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని కరెంటు కష్టాలు వెన్నాడుతున్నాయి.*


*- బుధవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు, బాలింతలు, గర్భిణులు విలవిల్లాడారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలుకావడంతో టార్చిలైట్ల వెలుగులో వైద్యులు ప్రసవం చేయాల్సి వచ్చింది.*


★ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిని కరెంటు కష్టాలు వెన్నాడుతున్నాయి. 


★ బుధవారం రాత్రి విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి బంధువులు, బాలింతలు, గర్భిణులు విలవిల్లాడారు. 


★ జనరేటర్‌ ఉన్నా అది పనిచేయలేదు.


★ ముఖ్యమైన విభాగాల్లో ఇన్వర్టర్లు రెండు గంటలు పనిచేశాక మొరాయించాయి. 


★ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలుకావడంతో టార్చిలైట్ల వెలుగులో వైద్యులు ప్రసవం చేయాల్సి వచ్చింది. 


★ జనరేటర్‌ పాడైన విషయాన్ని విశాఖపట్నంలోని సంబంధిత కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా.. ఉదయం మెకానిక్‌లు వచ్చి మధ్యాహ్నానికి బాగు చేశారు.


★ గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.


★ ఆ సమయంలో జనరేటర్‌పై ఫ్యాన్లు, లైట్లు మాత్రం పనిచేశాయి. 


★ రాత్రి వేళ కరెంటు పోతే ఇబ్బంది అవుతుందని రోగుల బంధువుల్లో కొందరు బ్యాటరీతో పనిచేసే టేబుల్‌ ఫ్యాన్లను కొనుక్కుని తెచ్చుకున్నారు. 


★ ఆసుపత్రిలో శుద్ధజలం ప్లాంటు మూడు రోజులుగా పనిచేయడం లేదు.


★ రోగుల సహాయకులు ఇళ్ల నుంచి సీసాలతో నీటిని తెచ్చుకుంటున్నారు.


★ ఆసుపత్రి ఇన్‌ఛార్జి పర్యవేక్షకులు డాక్టర్‌ డేవిడ్‌ వసంత్‌కుమార్‌ను వివరణ కోరగా.. జనరేటరు, మోటారు పాడైనప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 


★ విద్యుత్తు లేనప్పుడు ప్రసూతి విభాగంలో టార్చిలైట్లు, సెల్‌ఫోన్ల వెలుగులో ప్రసవం చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురాగా.. _*‘ప్రసవాన్ని వాయిదా వేయలేం కదా’*_ అని పేర్కొన్నారు.


★ శుద్ధజలం ప్లాంట్‌ను వెంటనే వినియోగంలోకి తీసుకువస్తామన్నారు.

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం