భీమిలి ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించినందుకు కృతజ్ఞతగా ఈరోజు మంత్రి వర్యులు ఆద్వర్యం లో రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూల మాలలు వేసి, జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం
 విశాఖపట్నం, ఏప్రిల్ 6:


భీమిలిపట్నంలో అతి ముఖ్యమైన చారిత్రాత్మక ప్రారంభోత్సవాలు చేసిన పర్యాటక శాఖ మంత్రి....

    ఈరోజు అనగా తేది 06-04-2022 నాడు భీమిలి ప్రజలు  ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రాముఖ్యమైన వాటిలో ఒకటైన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం కి వెళ్ళడానికి భక్తులు కోసం 73 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్డు ను ఈరోజు అనగా తేది 06-04-2022 నాడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనంతరం 100 ఏళ్ళు చరిత్ర పైబడి కలిగిన భీమిలి ప్రభుత్వం హాస్పిటల్ లో 3 కోట్ల రూ లతో అత్యంత ఆధునికత  వసతులుతో కూడిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను  మంత్రి వర్యులు ప్రారంబించారు. ప్రారంభోత్సవం ను ఉద్దేశించి మంత్రి వర్యులు మాట్లాడుతూ సుందరీకరణ తో శుభ్రంగా హాస్పిటల్ నిర్మించిన అధికారులకు దన్యవాదాలు తెలిపారు. భీమిలి చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా  నా హయాంలో ప్రత్యేక మైన దృష్టి పెట్టి హాస్పిటల్ ను త్వరితగతిన పూర్తి చేసి రోగులకు అందుబాటులోనికి తీసుకురావడం   చాలా సంతోషంగా ఉందని , నాడు నేడు లో బాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యతో పాటు వైద్య రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి  మెడికల్ కళాశాలలు ప్రతీ గ్రామంలో విలీజీ క్లినిక్ లు , పిహేచ్ సి లు, అర్బన్ ఏరియాలో వెల్ నెస్ సెంటర్స్, భీమిలి నియోజకవర్గం లో త్వరితగతిన ఈ పనులు జరుగుతున్నాయని అందులో కొన్ని హాస్పిటల్ కు వెల్ నెస్ సెంటర్స్ కు రెవెన్యూ పరంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా తగినంత స్థలాలు కేటాయించాలని అధికారులకు సూచించడం జరుగింది,కూడా అంతేకాక గర్భిణీ స్త్రీలకు 1 నెల నుండి 9 నెల వరుకూ క్రమం తప్పకుండా ఆశావర్కర్లు ఆయాలతో పౌష్టికాహారం ఇవ్వడం , అలాగే తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ , 108 అంబులెన్స్ లు తీసుకురావడం జరిగిందని,  కరోనా సమయంలో వ్యాక్సిన్ ప్రక్రియలో రాష్త్రం కి చాలా మంచి పేరు వచ్చేలా ముఖ్యమంత్రి చేసారని , అలాగే జిల్లా లో మంచి సేవలు అందించిన ఆశావర్కర్లు, ఏయన్ యమ్ లకు , వైద్య బృందం కి ధన్యవాదాలు తెలిపారు.. 

ఈ 30 పడకల ఆసుపత్రి ని కేజిహేచ్ కు సరి సమానంగా 50 పడకల ఆసుపత్రి గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేయడం జరిగింది . హాస్పిటల్ నిర్మించినందుకు మంత్రి అవంతి కి ప్రజలు సంతోషంతో దన్యవాదాలు తెలిపారు...  అనంతరం 26 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి దానిలో భాగంగా భీమిలి ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించినందుకు కృతజ్ఞతగా ఈరోజు మంత్రి వర్యులు ఆద్వర్యం లో రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూల మాలలు వేసి, జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, భీమిలి నియోజకవర్గం లో వైసిపి పార్టీ శ్రేణులతో  థ్యాంక్యూ సియం నినాదాలతో  బారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి చైర్ పర్సన్ సుభద్ర గారు, VMRDA చైర్ పర్సన్ విజయ నిర్మల గారు, యంయల్సి వరుదు కళ్యాణి గారు, ఆర్డీవో భాస్కర్ రెడ్డి గారు భీమిలి నియోజకవర్గం కార్పోరేటర్ లు, జెడ్పిటిసి లు, యంపిపి లు, వైస్ యంపిపి లు , వార్డు ప్రెసిడెంట్ లు ,  ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...