వసతి దీవెన క్రింద జిల్లాకు రూ.44.77 కోట్లు
47,960 మంది విద్యార్ధులకు ప్రయోజనం
విశాఖపట్నం, ఏప్రిల్ 8: జగనన్న వసతి దీవెన క్రింద రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి
జిల్లా లో 44.77కోట్ల రూపాయలు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. శుక్రవారం నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన వసతి దీవెన సభలో ముఖ్యమంత్రి వె.యస్.జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా 2021-22 విద్యా సంవత్సరం సంబంధించి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
జిల్లా నుండి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఎ. మల్లిఖార్జున, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రమణ మూర్తి, జిల్లా బి. సి సంక్షేమాధికారి శ్రీదేవి, పలువురు విద్యార్థులు వారి తల్లులు పాల్లొ న్నారు.
తదుపరి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన క్రింద జిల్లాలో ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుకుంటున్న విద్యార్ధులకు స్కాలర్ షిప్లు లభించాయని తెలిపారు. విశాఖపట్నం జిల్లాకు 47,960 మంది విద్యార్ధులకు సంబంధించి వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో 44.77 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. ఇందులో 4756 మంది ఎస్.సి విద్యార్థులు వారి తల్లుల ఖాతాల్లో4.42 కోట్ల రూపాయలు, 191 మంది ఎస్.టి విద్యార్థుల తల్లులు ఖాతాల్లో 17.40లక్షలు, 41,432 మంది బి.సి విద్యార్థుల తల్లులు ఖాతాల్లో రూ.38.69 కోట్లు, 1,581 మంది మైనారిటీ విద్యార్థుల తల్లులు ఖాతాల్లో రూ.1.48 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ఆయన తెలిపారు.
జారీ: ఉపసంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ,విశాఖపట్నం .