చిరిగిన కరెన్సీ నోట్లు మార్చుకోవాలా?

 చిరిగిన కరెన్సీ నోట్లు మార్చుకోవాలా? ఇలా చేయండి!


అమరావతి, (నిఘా ప్రతినిధి):     ఏటీఎంకు వెళ్లి నగదు విత్‌ డ్రా చేసినప్పుడో, లేదా దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసినప్పుడో మనకు చిరిగిన నోట్లు, మురికిగా ఉన్న కరెన్సీ నోట్లు రావడం అనేక సందర్భాల్లో జరుగుతుంటుంది. బయట ఎవరికి ఇచ్చినా వాటిని తీసుకోరు. ఈ క్రమంలో మనం చాలా అవస్థలు ఎదుర్కొంటుంటాం. అయితే, ఇలాంటి కరెన్సీ నోట్లు వస్తే ఏం చేయాలి? ఎలా మార్చుకోవాలనే అంశంపై ఆర్‌బీఐ పలు నిబంధనలు సూచించింది. వాటి ప్రకారం మీ వద్ద ఉన్న ఖరాబైన నోట్లను మార్చుకొని కొత్త నోట్లు పొందొచ్చు.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. చిరిగిపోయిన/ఖరాబైన నోట్లను బ్యాంకుల వద్ద సులభంగా మార్చుకోవచ్చు. ఒకవేళ అవి నకిలీ నోట్లు అయితే తప్ప బ్యాంకులు వాటిని తీసుకొనేందుకు నిరాకరించడానికి వీల్లేదు. ఏ బ్యాంకు అయినా చిరిగిన నోట్లను తీసుకోకపోతే మీరు నేరుగా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. అలాగైతే, ఆ బ్యాంకులపై చర్యలు ఉంటాయి.

కరెన్సీ నోట్లు చిన్న ముక్కలుగా ఉన్నా.. చిరిగిపోయిన నోట్‌లో ఏదైనా భాగం మిస్‌ అయినా కూడా ఏ బ్యాంకులో అయినా మార్చుకోవచ్చు. సాధారణంగా చిరిగిన నోట్లను కూడా ఏదైనా బ్యాంకు శాఖలో, ఆర్‌బీఐ కార్యాలయంలో మార్చుకొనే వీలు ఉంది. ఇందుకోసం ఎలాంటి ఫారం కూడా నింపాల్సిన అవసరం లేదు.

కరెన్సీ నోటుకు పెద్దగా దెబ్బతినకుండా ఎక్కడో చిన్న చిన్న ముక్కలుగా చిరిగితే వాటిని మార్చుకొని పూర్తి మొత్తంలో డబ్బును పొందొచ్చు. అదే, అదే పూర్తిగా చిరిగిన నోట్లకు మాత్రం మన వద్ద ఉన్న కరెన్సీ మొత్తం విలువలో కొంత శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. రూ.1 నుండి రూ.20 వరకు నోట్ల విషయంలో మాత్రం సగం మొత్తం ఇచ్చే నిబంధన ఏమీ వర్తించదు. అందువల్ల ఈ నోట్లకు పూర్తిగా చెల్లిస్తారు.

ఒకవేళ బాగా కాలిపోయిన, పూర్తిగా నలిగి ముక్కలైన కరెన్సీ నోట్లను మాత్రం మార్చుకోవడం కుదరదని ఆర్‌బీఐ నిబంధన పేర్కొంటోంది. అలాంటి కరెన్సీని ఆర్‌బీఐ ప్రత్యేకంగా జారీచేసే కార్యాలయాల్లో మాత్రమే డిపాజిట్‌ చేసే వీలు ఉంటుంది. ఇలాంటి కరెన్సీ నోట్లతో బ్యాంకుల్లో మీరు మీ బిల్లులు లేదా పన్నులు చెల్లించుకోవచ్చు._

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం