ప్రతి జర్నలిస్ట్ చదవండి

ప్రతి జర్నలిస్ట్ చదవండి

 వైసిపికి,టిడిపికి కోమ్ము కాసే జర్నలిస్ట్ మిత్రులు -


గతం అనగా చరిత్ర .చరిత్ర అంటే వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలే కాదు.గడియ గడిచినా చరిత్రే.గడిచిన కాలం నుండి పాఠాలు నేర్చుకోని మనల్నీ మనం తీర్చి దిద్దు కోవాలి. 


ముఖ్యంగా చీరాలలో అనేక మారులు హత్యాయత్నానికి గురియై చనిపోయాడు అనుకోని వదిలేస్తే బతికి బట్టకట్టి మంచానికే ఇంకా పరిమితమైన నాగార్జున రెడ్డిని గుర్తుకు తెచ్చుకోండి.

మరల ఆయన గురించి చెబుతాను వినండి.చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ తెలుగు దేశం ఎమ్మెల్యే గా కోనసాగుతున్న రోజుల్లో నాగార్జన రెడ్డి సాక్షి లో చేసే క్రమంలో ఆమంచి చేసె చేసే ఆక్రమాలను వెలికితీసి సాక్షి యాజమాన్యం చేత సెహబాష్ అనిపించు కున్నారు.కాని అవతల ఉంది అమంచి కృష్ణమోహన్ ఆయన అన్న రౌడిషటర్లు అధికార యంత్రాంగాన్ని తనగుప్పెట్లోకి ఉంచుకున్నారు.ఫలితంగా జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడులు సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదురుగనే జరిగాయి. జర్నలిస్ట్ నాగర్జన రెడ్డి బెదరలేదు తప్పుడు కేసులకు భయపడలేదు.ఓక్క సారి కాదు అనేక సార్లు ఆమంచి గుండాల చేతుల్లో దాడులకు గురియైయ్యారు.


ప్రభుత్వం మారింది.జర్నలిస్ట్ నాగార్జున రెడ్డికి మంచి రోజులు వచ్చాయనుకున్నారు.కాని మంచిరోజులు వచ్చింది అమంచి కృష్ణ మోహన్ కు ఫలితంగా వైసిపిలో చేరారు. వైరం నాగర్జన రెడ్డి అమంచిల అనే వ్యక్తుల మధ్య అయ్యింది.సదరు నమ్మకున్న సాక్షి పత్రిక నాగార్జున రెడ్డి మావాడు కాదంది.అమంచి కృష్ణ మోహన్ మావాడంది.దాంతో ఈసారి నాగార్జున రెడ్డిపై గట్ఞి దెబ్బ పడింది.రౌడీ మూకల చేతుల్లో దాడికి గురియైయ్యారు. మారణాయుధాలతో దాడి చేసి చనిపోయాడని  చెత్తకుప్పలో పారేసి వెళ్ళి పోయారు.

కొంతమంది చూసి. ఆయనను గుర్తిపట్టి హస్పటల్ లో చేర్పించారు.అనేక ఎముకలు విరిగి ఆయుధాల  దాడితో జడీయైన శరీరంతో కదలలేని స్థితిలో హస్పటల్ లో మూడు నేలలు పాటు కదలలేని స్థితిలో చికిత్స తీసుకున్నారు.


ఆయన కోలుకునేందుకు సంవత్సరం పైన పడుతుందని డాక్టర్లు చెప్పారు.అప్పుడు ఆయనను ఆదుకునేందుకు సాక్షి పత్రిక రాలేదు.ఆంధ్ర జ్యోతి రాలేదు.కనీసం యునియన్లు కూడ స్పందించ లేదు సరిగ్గా. 


రాష్ట్రంలో అనేక మంది నాగార్జున రెడ్లు ఉన్నారు.పార్టీలకు కావలసింది మంది మార్బలం అంతే.విలువలు కాదు దానికి పాతర వేశారు.


నీవు వారికి అవసరమైనంత వరకే తరువాత నీవు చస్తన్న కనీసం నీళ్ళు పోయరు.అటువంటి వారి గురించి మీరెందుకు పోట్లాడుకోని గోడవలు పెట్టుకుంటుంటారు.

జర్నలిస్ట్ అంటే సాక్షి,ఈనాడు,జ్యోతి,సత్యాగ్రహం, తెలుగు పత్రిక‌,వార్తా మండలీ, వార్తప్రభ, వాడు ఏవడైన ఓక్కడే మనందరం ఓక్కటే అనే భావన కలిగి ఉంటే సమాజమే కాదు.మన ఇళ్ళు కూడ బాగుంటాయి.కలహాలు మానండి బయటకు వస్తే అన్నదమ్ములు లాగ మోలగండి అప్పుడు మీ వంక చూడ టానికి మీ యాజమాన్యాలే భయపడతాయి.


జర్నలిస్ట్ మిత్రుల ఐక్యత వర్ధిల్లాలి

 అదిరిపోయే...ఉదాహరణ.

అర్థం చేసుకుంటే ఎంతో మంది జర్నలిస్టులకు మార్గనిర్దేశం ఈ నాగార్జున రెడ్డి సంఘటన. ఇక్కడ కులం కూడా పనిచేయలేదని గుర్తించండి. రాజకీయ రాక్షస క్రీడకు బలైన అభాగ్యులిలా ఎందరో...ఎందరెదరో...!!