విశాఖపట్నం, (నిఘప్రతినిధి): జిల్లాలో ఈ నెల 21వ తేదిన ఎ.పి.సి.ఎం .కప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల సంస్థ సి .ఇ.ఓ పి.వి.రమణ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ క్రీడా కారుల ప్రతిభను గుర్తించి వారిని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పేజ్-1 లో అథ్లెటిక్స్, వాలీబాల్, ఖోఖో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. నియోజక వర్గ స్థాయి పోటీలలో గెలిపొందిన క్రీడా కారుల జట్టులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. గోల్డెన్ జూబ్లీ, ఆంధ్రయూనివర్సిటి గ్రౌండ్స్ (జిమ్నాజియం గ్రౌండ్స్ )విశాఖపట్నంలో 21వ తేది గురువారం క్రీడా పోటీలు ఉదయం 10గంటలకు ప్రారంబోత్సవం, సాయంత్రం 6గంటలకు ముగింపు కార్యక్రమం జరగనున్నదని తెలిపారు.
జారీః ఉపసంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, విశాఖపట్నం