ఆలయంలో దొంగతనం జరగడం విచారకరం: మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

 విశాఖ పట్నం, (నిఘా ప్రతినిధి):



రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా సింహాచలం లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద ఆశీర్వచనాలు పలికారు. 

ఈక్రమంలో శనివారం రాత్రి కొండ దిగువున ఉన్న బంగారమ్మ తల్లి ఆలయంలో హుండీ దొంగతనం జరగడంతో మంత్రి ఆలయ ఈవో సూర్యకళతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయంలో దొంగతనం జరగడం విచారకరమని అన్నారు. రాత్రి ఆలయంలో నైట్ వాచ్ మెన్ ను విచారించి, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించాలని 24 గంటల్లో దొంగల్ని పట్టుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. ఆలయంలో భద్రత కట్టుదిట్టం చేయాలని ఆలయ ఈవో, పోలీసులకు మంత్రి సూచించారు.