భూమి పూజ

 సౌరాష్ట్రపటేల్ సేవా సమాజ్ సూరత్ లో నిర్మించిన హాస్టల్ ఫేజ్-1 కు అక్టోబర్ 15 న భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్న ప్రధాన మంత్రి

Posted Date:- Oct 14, 2021

సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ సూరత్ లో నిర్మించిన హాస్టల్ ఫేజ్-1 (బాలుర వసతి గృహం) తాలూకు భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ అక్టోబర్ 15 న ఉదయం 11:00 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించనున్నారు. ఈ హాస్టల్ భవనం లో సుమారు 1500 మంది విద్యార్థుల కు బస చేయడానికి తగిన సౌకర్యాలు ఉన్నాయి. ఈ హాస్టల్ భవనం లో ఒక సభాభవనం తో పాటు విద్యార్థుల కోసమే ఏర్పాటు చేసిన ఒక గ్రంథాలయం కూడా ఉంది. సుమారు 500 మంది బాలికల కోసం హాస్టల్ ఫేజ్-2 నిర్మాణ పనులు రాబోయే సంవత్సరం లో ఆరంభం కానున్నాయి