ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక భాగస్వామ్యంపై భారత్ అమెరికాల మంత్రుల స్థాయి సమావేశం
భారత్, అమెరికాల మధ్య ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక భాగస్వామ్యం పై వాషింగ్టన్ డిసి లో ఈ రోజు 8వ మంత్రుల స్థాయి చర్చలు జరిగాయి. భారత ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, అమెరికా ట్రెజరీ కార్యదర్శి డా. జానెట్ యెలెన్ అధ్యక్షతన చర్చలు జరిగాయి. సమావేశం అనేక అంశాలు చర్చకు వచ్చాయి.
ఆర్థిక మరియు ఆర్థిక భాగస్వామ్యం,పై ఏర్పాటైన భారత్, అమెరికా మంత్రుల స్థాయి సమావేశంలో స్థూల ఆర్థిక దృక్పథం, కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం నుంచి కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థలు, ఆర్థిక నియంత్రణ మరియు సాంకేతిక సహకారం, బహుపాక్షిక భాగస్వామ్యం, వాతావరణ సంబంధిత అంశాలకు నిధులు సమకూర్చడం, మనీలాండరింగ్ నిర్మూలన చర్యలు, తీవ్రవాదం కార్యక్రమాలకు నిధులు అందకుండా అమలు చేయవలసిన చర్యలు లాంటి అనేక అంశాలపై చర్చలు జరిగాయి. రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలతో పాటు ప్రపంచ స్థాయిలో ఆర్థిక పరమైన సమస్యలను పరిష్కరించడానికి కలిసి పనిచేసే ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి. సమస్యల పరిష్కారానికి వ్యూహాలను రూపొందించాలని నిర్ణయించారు.
భారత ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి,అమెరికా ట్రెజరీ కార్యదర్శి సంయుక్త ప్రకటనకు ఆమోదం తెలిపిన తరువాత సమావేశం ముగిసింది.