మంత్రులు డమ్మీలు : మాజీ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్రారెడ్డి
అమరావతి, (నిఘా ప్రతినిధి):మాజీ మంత్రి డాక్టర్ డి.ఎల్.రవీంద్రారెడ్డి మళ్లీ తెలుగుదేశం వైపు చూస్తున్నారా? లేక ఇప్పటికే ఆ పార్టీ తో అవగాహనకు వచ్చారా? వైసిపికి పరోక్షంగా మద్దతు ఇచ్చి, తొలుత ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసించిన డి.ఎల్.ఇప్పుడు మళ్లీ విమర్శలు చేస్తున్నారు. డిఎల్. కు ఎమ్మెల్సీ పదవి వస్తుందని భావించారు. కాని అది సాధ్యపడలేదు. మరో నేత సి.రామచంద్రయ్యకు వైసిపి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. కారణం ఏమైనా ఆయన వచ్చే ఎన్నికలలో పోటీచేస్తానని, ఏ పార్టీ అన్నది చెప్పలేనని, ఎవరు టిక్కెట్ ఇవ్వకపోయినా పోటీలో ఉంటానని ఆయన అన్నారు. తప్పు చేసినవారు జైలుకు వెళ్లక తప్పదని ఆయన అన్నారు. ప్రజలు 500 , వెయ్యికి ఆశపడరాదని అన్నారు. రెడ్ల ప్రభుత్వం రావాలని కోరుకున్నవారందరికి ఇప్పుడు బుద్ది వచ్చిందని ఆయన అన్నారు. మంత్రులు డమ్మీలు అయ్యారని ఆయన అన్నారు. రైతులు సమస్యలు పడుతున్నారని, కౌలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన అన్నారు.