పేదలకు వచ్చే ఇళ్లు ఆపితే టిడిపిపై ప్రజల తిరుగుబాటు తప్పదు: విజయసాయిరెడ్డి


 పేదలకు వచ్చే ఇళ్లు ఆపితే టిడిపిపై ప్రజల తిరుగుబాటు తప్పదు: విజయసాయిరెడ్డి

విశాఖపట్నం.(నిఘా ప్రతినిధి):  పేదలకు వచ్చే ఇళ్లు ఆపితే  టీడీపీపై  ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుందని ఉత్తరాంధ్ర వైఎస్సార్ పార్టీ ఇంచార్జీ,రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అన్నారు..సోషల్ మీడియా వేదికగా పలు ఆంశాలను ఆయన ప్రస్తావించారు.. చనిపోయిన వ్యక్తుల పేర్లతోనూ పిటిషన్లు వేయిస్తూ పేదలందరికీ ఇళ్ళను ఎన్నో రోజులు అడ్డుకోలేరనన్నారు.ఇది అరచేతిని అడ్డంపెట్టి సూర్య కాంతిని ఆపడంలాంటిదే, ఈ మబ్బులు త్వరలోనే తొలగిపోతాయన్నారు..అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు కంగారు పడాల్సిన అవసరం లేదని  సంక్షేమం, అభివృద్ధి ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళుని చెప్పుకొచ్చారు. సెకండరీ గ్రేడ్ టీచర్లను స్కూల్  అసిస్టెంట్లు, హెడ్ మాస్టర్లగా ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని,ఈనెల16 నుంచే ఈ  ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. అదే విధంగా అందరి సంక్షేమం గురించి ఆలోచించే సర్కార్ ఇదని ఆయన స్పష్టం చేసారు. ఏపీ సచివాలయ ఉద్యోగులకు ఉచిత గృహ వసతి సౌకర్యం మరో ఆరు నెలలు పొడిగించిదని వెల్లడించారు.యువజన, శ్రామిక, రైతు అని పార్టీ పేరులో ఉంది కదా అని ఉద్యోగులను విస్మరించే ప్రసక్తేలేదన్నారు..   అలాగే

ప్రజల ముంగిటకే మెరుగైన వైద్యసేవలు అందించేలా ఫామిలీ డాక్టర్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేసేందుకు జగన్ గారి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు.ఈ ప్రభుత్వం ప్రతి మండలానికి రెండు 104 వాహనాలు ఉండేలా కొత్తగా 539 వాహనాల కొనుగోలుకు అనుమతించిందని వెల్లడించారు. ఈ వాహనాలు వచ్చే జనవరి 26నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పారు..


వృక్షం తల్లిలాంటిదని,అమ్మ జన్మనిస్తే మొక్క మనుగడనిస్తుందని పేర్కొన్నారు..అందుకే వాటిని దేవతలుగా భావించి ఇతిహాసాల కాలం నుంచి పూజలు చేస్తున్నామని చెప్పారు. పంచభూతాలు చల్లగా ఉండాలంటే మొక్కే మూలమని ఆయన గుర్తు చేశారు. నగరాల్లోని ఖాళీ స్థలాలను మినీ ఫారెస్ట్ లుగా మార్చుకోవాలను   సూచించారు.అలాగే ఫారెస్ట్ కవర్ 23%నుంచి 33% పెంచుకోవాలని విజయసాయిరెడ్డి చెప్పారు..