ఆస్పత్రి నుంచి డిశ్చార్ అయిన సాయి ధరమ్ తేజ

 

ఆస్పత్రి నుంచి డిశ్చార్ అయిన సాయి ధరమ్ తేజ

హైదరాబాద్, (నిఘా ప్రతినిధి): నటుడు సాయిధరమ్ తేజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ ద్వారా తెలిపారు. ధరమ్ తేజకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ , పూర్తిగా కోలుకుని ధరమ్ తేజ ఇంటికి వచ్చారని తెలిపారు. ఆయన గత నెల పదకుండున రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. మోటార్ బైక్ పై వెళుతూ స్కిడ్ అవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆపోలో ఆస్పత్రిలో చేర్చి చికిత్స చేశారు. సాయి ధరమ్ తేజకు ఇది పునర్జన్మ అని చిరంజీవి వ్యాఖ్యానించారు.