రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారు:పులివెందుల ఇంచార్జ్ ఎమ్మెల్సీ,బి.టెక్ రవి
పులివెందుల, (నిఘా ప్రతినిధి): రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయి , ప్రతిపక్ష నేతల ఇళ్ళ మీద , దాడులు చేయడం చూశాం , ఇప్పుడు ఏకంగా రాష్ట్ర కార్యాలయాల మీద పడి దాడి చేయడం అత్యంత హేయం అని పులివెందుల ఇంచార్జ్ ఎమ్మెల్సీ, బి.టెక్ రవి గారు పేర్కొన్నారు.
పట్టాభి గారి ఇంటి మీద దాడి జరుగగా అది కాకుండా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఇంటి మీదకు కూడా ఇటీవల ఇదే తరహా దాడికి యత్నించడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏంటో స్పష్టం అవుతోంది. ఇంత గుంపులు గుమిగూడి దాడులకు బయలుదేరుతున్నా పోలీస్ వారికి ముందస్తు సమాచారం లేకపోవడం చూస్తుంటే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రశ్నిస్తే దాడులకు తెగబడటం , అక్రమ కేసులు బనాయించడం ప్రతిపక్ష నేతల గొంతును బలవంతంగా నొక్కే ప్రయత్నం జరుగుతుంది.ఈ తెల్లవారుజామున నుండి
యస్.ఐ లు, సి.ఐ లు శాంతి యుత ధర్నా చేస్తాం అంటే వెళ్లడం కుదరదు అని హౌస్ అరెస్ట్ చేశారు, మరి పులివెందుల పులంగళ్ల సెంటర్ లో వైసీపీ వారు 200 నుండి 300 మంది ఏవిధంగా ర్యాలీకి అనుమతి ఇచ్చారు, మా అధినాయకుని బొమ్మను కూడా కాల్చారు.దీనిని బట్టి పోలీస్ వ్యవస్థ ఓనిసైడ్ చేస్తుందని అర్థం అవుతుంది.*1978 రాజశేఖరరెడ్డి హయాం నుండి పులివెందులను యూనిట్ గా తీసుకొని గతంలో టీడీపీ ఆఫిస్ మరియు నాయకుల ఇండ్లు కాల్చి అనేకమైన మర్డర్లు చేయించి,పులివెందుల ప్రజలను* *ఎట్ల అయితే లొంగదీసుకున్నారో*
*అలాగే రాష్ట్రాన్ని కూడా యూనిట్గా తీసుకొని ప్రజలను* *భయభ్రాంతులకు*
*గురి చేసి రాష్ట్ర ప్రజలను లొంగదీసుకోవడానికే ఈ అరాచక ప్రయత్నం అని తెలుస్తోంది.ఈ రాష్ట్రంలో ఈ వరుస ఘటనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉంది ,రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల మీద నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇటువంటి దాడులకు తెగబడుతున్నారు అనిపిస్తోంది.* ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం , రాష్ట్ర గవర్నర్ గారు రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలను పరిశీలించి దిద్దుబాటు చర్యలు చేయకపోతే రాష్ట్రం రావణకాష్టం కాకతప్పదు అని ఎమ్మెల్సీ, బి.టెక్ రవి గారు పేర్కొన్నారు.