అవార్డులు మరెంతో మందికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి – ఉపరాష్ట్రపతి

 అవార్డులు మరెంతో మందికి ప్రోత్సాహాన్ని అందిస్తాయి – ఉపరాష్ట్రపతి


• తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ సారస్వత పరిషత్తు పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది

• ఆధునిక కవిత్వ చేతనను ఆవిష్కరించేందుకు శ్రీ కోవెల సుప్రసన్నాచార్య గారు విశేషమైన కృషి చేశారు

• నెల్లూరుకు చెందిన మణిదీపాల్లో... పుంభావ సరస్వతి స్వరూపులు శ్రీ పోలూరి హనుమజ్జానకీ రామశర్మ గారు కూడా ఒకరు

• శ్రీ పోలూరి హనుమజ్జానకీ రామశర్మ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి

• అవగాహన స్వతహాగానే పెంచుకోగలిగినా, ధాటిగా మాట్లాడగలిగే నేర్పు శర్మ ప్రేరణతోనే అలవాటు చేసుకున్నాను

• తమ గురువు గారైన  పోలూరి హనుమజ్జానకీ రామశర్మ  పేరిట తెలంగాణ సారస్వత పరిషత్ ద్వారా అవార్డును నెలకొల్పి, తొలి అవార్డును  కోవెల సుప్రసన్నాచార్య అందజేసిన ఉపరాష్ట్రపతి


అవార్డులు అందజేయడం ద్వారా మరెంతో మందికి ప్రేరణ కలుగుతుందని, భాషాభివృద్ధి దిశగా యువత ముందుకు రావడానికి దోహదపడుతుందని గౌరవ ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు  తెలిపారు. శ్రీ వెంకయ్య నాయుడు డిగ్రీ చదివే రోజుల్లో వారి తెలుగు ఆచార్యులైన శ్పో లూరి హనుమజ్జానకీ రామశర్మ  పేరిట తెలంగాణ సారస్వత పరిషత్ ద్వారా స్వయంగా అవార్డును నెలకొల్పి, తొలి అవార్డును కోవెల సుప్రసన్నాచార్య గారికి అందజేశారు.

తమ ఆచార్యుల పేరిట అవార్డును ఏర్పాటు చేసి, అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్న ఉపరాష్ట్రపతి,  పోలూరి హనుమజ్జానకీ రామశర్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. చదువు నేర్పిన గురువు సాక్షాత్తు భగవంతుడి స్వరూపమన్న పెద్దల మాటలను ఉద్ఘాటించిన ఆయన, శ్రీరాముడు, శ్రీకృష్ణడు లాంటి పురాణపురుషులు సైతం గురు సుశ్రూషలు చేశారన్నారు. డిగ్రీ చదివే రోజుల్లో తెలుగు భాష పట్ల, తెలుగు సాహిత్యం పట్ల,  హనుమజ్జానకీరామ శర్మ మక్కువ పెరిగేలా చేశారన్న ఉపరాష్ట్రపతి, తమ రాజీకీయ జీవితంలో వివిధ అంశాల పట్ల అవగాహన స్వతహాగానే పెంచుకోగలిగినా, వాటిని ధాటిగా మాట్లాడగలిగే నేర్పు వారి ప్రేరణతోనే వచ్చిందన్నారు.

ఏటా తమ మిత్రులు నిర్వహించే  పోలూరు హనుమజ్జానకీరామశర్మ  జయంతి కార్యక్రమంలో ప్రోటోకాల్ ఇబ్బందుల కారణంగా పాల్గొనలేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఇవాళ అవార్డును ఏర్పాటు చేసి, అందజేయడం సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ సందర్భాన్ని గురురుణం తీర్చుకోవడంగా పత్రికల్లో రాశారన్న ఆయన, ఇలాంటివి ఎన్ని చేసినా తల్లిదండ్రుల రుణం, గురువుల రుణం తీర్చుకోలేమని తెలిపారు. పోలూరి హనుమజ్జానకీరామ శర్మ  చూడగానే ఏదో తెలియని గౌరవం కలుగుతుందన్న ఉపరాష్ట్రపతి, సంప్రదాయబద్ధమైన పంచె కట్టు, చక్కని బొట్టు, పండిత వర్చస్సుతో ఇట్టే ఆకర్షించే మూర్తీభవించిన తెలుగుదనం వారిదని తెలిపారు.

తెలంగాణ సారస్వత పరిషత్ అంటే తమకు ప్రత్యేకమైన అభిమానమన్న ఉపరాష్ట్రపతి, మాతృభాషను నేర్చుకోవడం కూడా నేరంగా పరిగణించే రోజుల్లో, తెలుగు భాషను సంరక్షించుకునే సంకల్పంతో 1943లో ఈ సంస్థ ఏర్పాటైందన్నారు. ఎప్పటికప్పుడు నిత్యనూతనత్వాన్ని సంతరించుకుంటూ తెలుగు భాషా వెలుగుల్ని ముందు తరాలకు అందించేందుకు కృషి సలుపుతున్న పరిషత్తు కార్యక్రమాలు స్ఫూర్తి దాయకమన్న ఆయన, సంస్కృతి సారస్వత వికాసానికి కృషి చేయడం, నిరక్షరాస్యతను నిర్మూలించి మాతృభాషలో విద్యావ్యాప్తి కొనసాగించడం లాంటి ప్రధాన ఉద్దేశాలతో ప్రారంభమై... సభలు సమావేశాల నిర్వహణ, ప్రాచీన సారస్వత ముద్రణ, పారిభాషిక-మాండలిక పదకోశాల తయారీ లాంటి కార్యక్రమాలను కొనసాగించడం ముదావహమని తెలిపారు. ఈ సందర్భంగా నాటి అధ్యక్షులు శ్రీ దేవులపల్లి రామానుజరావు, శ్రీ సి.నారాయణరెడ్డి కృషిని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, వారి స్ఫూర్తితో తెలంగాణ సారస్వత పరిషత్ ముందుకు సాగుతుండడం అభినందనీయమని తెలిపారు.

ఈ సందర్భంగా అవార్డు గ్రహీత శ్రీ కోవెల సుప్రసన్నా చార్యకి అభినందనలు తెలియజేసిన ఉపరాష్ట్రపతి, కవిగా... పద్య విద్య మీద గాఢమైన అనురాగం ఉన్నా, ఆధునిక కవిత్వ చేతనను ఆవిష్కరించేందుకు వారు కృషి చేశారని తెలిపారు. సమాజంలో అక్కడక్కడా పేరుకుపోయిన వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన భారతీయ తత్వవేత్తల దృష్టిని సమగ్ర యోగ భావనలను కవిత్వంలోకి ప్రవేశపెట్టే చొరవ చేసిన శ్రీ సుప్రసన్నాచార్య గారు, ఆధునిక సాహిత్య విమర్శలో నవ్య సంప్రదాయ వాదాన్ని ఆవిష్కరించారని తెలిపారు. ఇలాంటి వారి స్ఫూర్తితో మాతృమూర్తి, మాతృభాష, జన్మభూమి, మాతృదేశం, చదువు చెప్పిన గురువులను స్మరించుకుంటూ మన భారతీయ సంస్కృతి మనకు నేర్పించిన వసుధైవ కుటుంబక భావన, ప్రకృతిని ప్రేమించడం – ప్రకృతితో కలిసి జీవించడం లాంటి అంశాలను యువత అవగతం చేసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డా. జె.చెన్నయ్య... సాహిత్య అకాడమీ ప్రచురణల్లో భాగంగా రచించిన పరిషత్ పూర్వ అధ్యక్షులు శ్రీ దేవులపల్లి రామానుజరావు జీవితానికి సంబంధించిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. అనంతరం కిన్నెర ఆర్ట్స్ థియేటర్ వారు భారత అమృతోత్సవాలను పురస్కరించుకుని ప్రచురించిన కవితా సంకలనం అమృతోత్సవ భారతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమృతోత్సవ భారతి పుస్తకంలో ఎంతో స్ఫూర్తి దాగి ఉందన్న ఆయన, నాడు స్వరాజ్య ఉద్యమంలో ఎంతో మంది కవులు దేశభక్తిని ప్రబోధించి ఉద్యమం దిశగా ప్రేరేపించారని, ఈ పుస్తకం ఆ స్ఫూర్తిని మరింత ఉత్తేజితం చేసే విధంగా ఉందని తెలిపారు.

మాతృభాష ఔన్నత్యాన్ని వివరించిన ఉపరాష్ట్రపతి, రాజకీయంగా, సామాజికంగా, వివిధరంగాల్లో ఉన్నత స్థానాలను అధిరోహించిన వారిలో చాలా మంది వారి వారి మాతృభాషల్లోనే విద్యాభ్యాసం చేశారన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి పేర్లను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పరిపాలన, న్యాయరంగంతోపాటు ప్రజలతోనేరుగా అనుసంధానమయ్యే ప్రతిరంగంలోనూ మాతృభాష వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరాన్నీ ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. 

అంతకుముందు, శ్రీ పోలూరి హనుమజ్జానకీ శర్మ గారి సాహిత్యసేవను ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఉపరాష్ట్రపతి తిలకించారు.

తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ జె. చెన్నయ్య, పురస్కార గ్రహీత ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, విశ్రాంత ఐ.పి.ఎస్. అధికారి డా. ఆర్. ప్రభాకర రావు, ఆల్ ఇండియా రేడియో విశ్రాంత డీజీ శ్రీ రేవూరు అనంత పద్మనాభ రావు, కిన్నెర ఆర్ట్స్ థియేటర్ కార్యదర్శి శ్రీ మద్దాళి రఘురామ్ సహా పలువురు భాషాభిమానులు, భాషావేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం