దేశంలోని కోవిడ్ 19 తరువాత మొట్టమొదటి 'వన్ హెల్త్' కన్సార్టియం బయోటెక్నాలజీ విభాగం ద్వారా ప్రారంభం
డాక్టర్ రేణు స్వరూప్ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో, ఈ కన్సార్టియం, డీబీటీ- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ, హైదరాబాద్ నేతృత్వంలోని 27 సంస్థలను కలిగి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కోవిడ్ తర్వాత ప్రారంభించిన అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమాలలో ఇది ఒకటి. వన్ హెల్త్ కన్సార్టియంలో ఎయిమ్స్, ఢిల్లీ, ఎయిమ్స్ జోధ్‌పూర్, ఐవిఆర్ఐ, బరేలీ, గద్వసు, లుధియానా, తనువాస్, చెన్నై, మాఫ్సు, నాగపూర్, అస్సాం వ్యవసాయ మరియు పశువైద్య విశ్వవిద్యాలయం మరియు అనేక ఐసిఏఆర్, ఐసిఎంఆర్ కేంద్రాలు మరియు వైల్డ్ లైఫ్ ఏజెన్సీలు ఉన్నాయి.
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా "ఎసెన్షియల్స్ ఆఫ్ వన్ హెల్త్" అనే అంశంపై అంతర్జాతీయ మినీ సింపోజియంను డీబీటీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ ప్రారంభించారు. భ
విష్యత్ మహమ్మారి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి మానవులు, జంతువులు మరియు వన్యప్రాణుల ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడానికి సమగ్రమైన విధానం అవసరాన్ని డాక్టర్ భట్నాగర్ నొక్కి చెప్పారు. అందరి ఆరోగ్యాన్ని కాపాడటానికి మనిషి, జంతువు, మొక్కలు మరియు పర్యావరణం ఒకరికొకరు అభినందనీయులుగా పరిగణించాల్సిన 'వన్ హెల్త్' అనే భావనను ప్రారంభించడం మరియు పెంపొందించడంపై అంతర్జాతీయ మరియు జాతీయ వక్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.