‘ఇండియా @75 బి.ఆర్.ఒ. మోటార్ సైకిల్ యాత్ర’
 ప్రారంభించిన రక్షణ మంత్రి


సేలా సొరంగ మార్గం తవ్వకం పూర్తి!
ప్రధానమార్గంలో పేల్చివేత ప్రక్రియకు
రక్షణమంత్రి రాజనాథ్ అధ్యక్షత
వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా కార్యక్రమ నిర్వహణ...

అరుణాచల్ లోని తవాంగ్.తో అనుసంధానమే
సేలా కనుమ సొరంగ మార్గం ప్రత్యేకత








 

· జాతీయ భద్రతను, అరుణాచల్ ప్రదేశ్ ఆర్థిక, సామాజిక అభివృద్ధిని బలోపేతం చేయబోతున్న సేలా కనుమ సొరంగ మార్గం.

· సాయుధ బలగాల సన్నద్ధతను ఇనుమడింపచేయడంలో, సరిహద్దు ప్రాంతాల్లో ఉపాధి కల్పన, పర్యాటకాభివృద్ధిలో  సరిహద్దు రహదారుల సంస్థదే కీలకపాత్ర.

 · జాతీయ సమగ్రత, జాతినిర్మాణ ఆవశ్యకతా సందేశాన్ని విస్తరింపజేయనున్న మోటార్ సైకిల్ యాత్ర.

 

   దేశంలోని ఇతర ప్రాంతాలను అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పుకామెంగ్, పశ్చిమ కామెంగ్, తవాంగ్ జిల్లాలతో అనుసంధానం చేసే సేలా కనుమ సొరంగ మార్గ నిర్మాణంలో ప్రధాన తవ్వకం పనులు పూర్తయినందుకు సూచనగా నిర్వహించిన పేల్చివేత (బ్లాస్టింగ్) కార్యక్రమానికి రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. న్యూఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా  ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సరిహద్దు రహదారుల సంస్థ (బి.ఆర్.ఒ.) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ‘ఇండియా@75 బి.ఆర్.ఒ. మోటార్ సైకిల్ యాత్ర’ను కూడా రాజనాథ్ సింగ్ పతాకం ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

  భారతీయ రక్షణ సిబ్బంది అధిపతి జనరల్ బిపిన్ రావత్, రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, సరిహద్దు రహదారుల సంస్థ (బి.ఆర్.ఒ.) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ రాజీవ్ చౌధరి,  ప్రభుత్వ సీనియర్ అధికారులు, సైన్యాధికారులు, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.

   ఈ సందర్భంగా రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ కామెంగ్ జిల్లాలోని సేలా సొరంగ మార్గం జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ ప్రాంతపు సామాజిక ఆర్థికాభివృద్ధికి ఈ మార్గం ఎంతో దోహదపడుతుందని అన్నారు.

    తూర్పు, పశ్చిమ కామెంగ్, తవాంగ్ జిల్లాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేసే 317 కిలోమీటర్ల బలిపారా-చర్దౌర్-తవాంగ్ రహదారిలో 13,800 అడుగుల ఎత్తున పర్వత సానువుల్లో సైలా కనుమ సొరంగం ఉంది. ఈ సొరంగ మార్గ నిర్మాణంతో ప్రయాణ కాలం కూడా గణనీయంగా తగ్గడంతోపాటుగా, ఏ కాలంలో అయినా ఈ మార్గంలో ప్రయాణానికి అవకాశం ఏర్పడుతుంది.

  కార్యక్రమంలో రాజనాథ్ సింగ్ మాట్లాడుతూ, ఎత్తయిన పర్వత సానువుల్లో అతి తీవ్రమైన ప్రతికూల వాతావరణంలో కూడా రహదారులను, వంతెనలను, సొరంగాలను, వైమానిక క్షేత్రాలను నిర్మించడం ద్వారా సరిహద్దు రహదారుల సంస్థ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు. సరిహద్దు రహదారుల సంస్థ తన కృషితో మారుమూల ప్రాంతాలు కూడా క్రమంగా రేఖాచిత్రపటాల్లో చోటుచేసుకుంటున్నాయని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు బి.ఆర్.ఒ. చేస్తున్న కృషితో సాయుధ బలగాల సన్నద్ధత మరింతగా ఇనుమడించిందని అన్నారు. అంతేకాక, సుదూర ప్రాంతాల్లో పర్యాటక కార్యకలాపాలు పెంచేందుకు, ఆయా ప్రాంతాల్లో స్థానికుల ఉపాధి కల్పనకు ఇది తోడ్పడుతోందని అన్నారు. ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న భవిష్యత్తులో తవాంగ్ ప్రాంతానికేకాక, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంతటికీ ఒక జీవనాడిగా ఈ సొరంగ మార్గం మారుతుందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.

   రోహ్తాంగ్ వద్ద 10వేల అడుగుల ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ సొరంగ మార్గాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో 19,300 అడుగుల ఎత్తులో నిర్మించిన ఉమ్లింగ్లా కనుమ మార్గాన్ని గురించి కూడా కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. బి.ఆర్.ఒ. ఇటీవల సాధంచిన ఇలాంటి విజయాలన్నీ ప్రపంచ దేశాలన్నింటికీ అధ్యయనాంశాలుగా మారాయని అన్నారు.

    బి.ఆర్.ఒ. ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభమైన ‘ఇండియా@75 బి.ఆర్.ఒ. మోటార్ సైకిల్ యాత్ర’ను రాజనాథ్ సింగ్ ప్రస్తావిస్తూ, దేశ సేవలో తమ ప్రాణాలను త్యాగం చేసిన సైనికులకు ఈ యాత్ర సముచితమైన నివాళిగా అభివర్ణించారు. స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లవుతున్న సందర్భాన్ని పురస్కరించకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా ఈ మోటార్ సైకిల్ యాత్రను రూపొందించారు. బి.ఆర్.ఒ., భారతీయ సైన్యం, జనరల్ రిజర్వ్ ఇంజినీర్ ఫోర్స్ (జి.ఆర్.ఇ.ఎఫ్.-గ్రెఫ్)కు చెందిన 75మంది ఈ యాత్రలో పాల్గొంటున్నారు. 75 రోజులపాటు జరిగే ఈ యాత్ర దాదాపు 20వేల కిలోమీటర్లు సాగుతుంది. ఈ యాత్రా మార్గంలోని ఆయా ప్రాంతాల్లోని స్థానికులను, పాఠశాలల చిన్నారులను, సాహస అవార్డుల విజేతలను, మాజీ సైనికులను, వీరనారులను ఈ యాత్రలో పాల్గొనే సిబ్బంది కలుసుకుంటారు. యాత్రలో భాగంగా పలు చోట్ల వైద్య శిబిరాలను నిర్వహిస్తారు. స్వచ్ఛ భారత్ అభియాన్, రహదారి భద్రత  వంటి అంశాలపై అవగాహన కూడా కల్పిస్తారు.

 ప్రజల్లో, ప్రత్యేకించి యువజనుల్లో జాతీయ సమగ్రత, జాతి నిర్మాణ సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ మోటార్ సైకిల్ యాత్ర దోహదపడుతుందన్న ఆశాభావాన్ని రక్షణమంత్రి వ్యక్తం చేశారు. ఇలాంటి యాత్రలు కేవలం సాహసకృత్యాలను ప్రోత్సహించడం మాత్రమేకాక, రక్షణ, భద్రతా అంశాల ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయన్నారు. “ఇలాంటి యాత్రల ద్వారా సరిహద్దు భద్రత, తదితర అంశాలపై అదనపు సమాచారాన్ని మనం సమీకరించవచ్చు. ఇలాంటి కార్యకలాపాలకు మన సైన్యం ఎంతో ప్రోత్సాహం అందించింది. భద్రతకు సంబంధించిన సమాచార సేకరణలో ఇది మనకు ఎంతో దోహదపడుతోంది.” అని రాజనాథ్ సింగ్ అన్నారు. ఇలాంటి కార్యకలాపాలకు ప్రోత్సాహం కోసం మనం సామాన్య ప్రజలకు చేరువగా వెళ్లాలని అన్నారు. దీనితో పర్యాటకాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ పటిష్టత వంటి లక్ష్యాలు సాధ్యమవుతాయని కేంద్రమంత్రి అన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కూడా శక్తివంచన లేకుండా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ యాత్రలో పాల్గొనే వారు తమ అనుభవాలను నమోదు చేయాలని, ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా భావితరాలకోసం వాటిని భద్రపరచాలని పిలుపునిచ్చారు.

    అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోని సేలా కనుమ సొరంగ మార్గ నిర్మాణ పథకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019లో శంకుస్థాపన చేశారు. బలిపారా-చంద్రౌర్-తవాంగ్ రహదారి ద్వారా తవాంగ్ ప్రాంతానికి అన్ని కాలాల్లో రోడ్డు మార్గం ద్వారా అనుసంధానం ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ సొరంగ మార్గ పథకాన్ని చేపట్టారు. ఈ రోజు జరిగిన పేల్చివేతతో సేలా కనుమలో ప్రధాన సొరంగ తవ్వకం పూర్తి అయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన 980 మీటర్ల పొడవైన రెండవ సొరంగంలో ఇప్పటికే 700మీటర్లకు మార్గానికి తవ్వకం ముగిసింది.

  ఒకటిన్నర కిలోమీటర్ల పొడవుతో ఈ సొరంగ నిర్మాణం పూర్తయితే, 13,600 అడుగులకుపైగా ఎత్తయిన పర్వత సానువుల్లో రెండు లేన్లలో నిర్మించిన ప్రపంచంలోని అతి పొడవైన సొరంగ మార్గాల సరసన ఇది చేరుతుంది. వినూత్నమైన ఈ సొరంగ మార్గ నిర్మాణంకోసం అధునాతనమైన కొత్త తరహా ఆస్ట్రియన్ సొరంగ నిర్మాణ పద్థతిని అనుసరిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో దారి అంతా మంచుతో కప్పుకుపోయే పరిస్థితి, దాన్ని తొలగించాల్సిన సవాళ్ళను పరిష్కరిస్తూ, అన్ని కాలాల్లో రోడ్డు అనుసంధానం ఉండేలా ఈ సొంరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారు. సేలా కనుమ ద్వారా మరింత వేగంగా గమ్యం చేరేందుకు వీలు కలిగించే ఈ సొరంగ మార్గం ఇకపై తవాంగ్ ప్రాంత ప్రజలకు ఒక గొప్ప వరంలా మారబోతోంది.

   మరోవైపు,.. ‘ఇండియా @75 మోటార్ సైకిల్ యాత్ర’ 75రోజులపాటు దేశం నలుమూలలకూ సాగుతుంది. న్యూఢిల్లీలోని ఇండియాగేట్.నుంచి ఉత్తరాదిలో రోహ్తంగ్, ఖర్డుంగ్ లా, ఉమ్లింగ్లా వంటి పర్వత కనుమల గుండా సాగుతుంది. ఇక రెండవ దశలో శ్రీనగర్.నుంచి సిరిగుడి వరకూ సాగుతుంది. 3వ, 4వ దశల్లో సిలిగుడినుంచి గ్యాంగ్టక్ ద్వారా డూమ్ డూమా వరకు యాత్రను నిర్వహిస్తారు. ఆ తర్వాత ఈ యాత్ర ఈశాన్య ప్రాంతాలగుండా కోల్కతా చేరుకుంటుంది. ఐదవ, ఆరవ దశల్లో దేశంలోని తూర్పు, దక్షిణ, పశ్చిమ కోస్తా ప్రాంతాలగుండా యాత్రను నిర్వహిస్తారు. చివరిదశలో ఎడారి ప్రాంతాల ద్వారా సాగుతుంది. అంతిమంగా ఈ ఏడాది డిసెంబరు 27వ తేదీన ఈ యాత్ర న్యూఢిల్లీ చేరుకుంటుంది. ఈ యాత్ర నిర్వహణకు, హీరో మోటో కార్ప్, భారత్ పెట్రోలియం లిమిటెడ్ సంస్థలు స్పాన్సార్లర్లుగా వ్యవహరిస్తున్నాయి. యాత్రకు అవసరమైన సాహసక్రీడల మోటార్ సైకిళ్లను, రక్షణ పరికరాలను, జాకెట్లను, విడి భాగాలను, సాంకేతిక సహాయాన్ని ఈ సంస్థలు అందిస్తున్నాయి.

  

Popular posts
షాడోలు మాత్రం వారే: అచ్చెన్నాయుడు
మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Image
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
Image
నకిలీ చెక్కులపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌?
మారేడుమిల్లి వద్ద రోడ్డుప్రమాదం:ముగ్గురి మృతి