దారుబింబబాలాలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు
ఈనెల 24న గండి క్షేత్రానికి అహోబిలం, శారదా పీఠాల పీఠాధిపతుల రాక
చక్రాయపేట వైసిపి మండల ఇన్చార్జి వైయస్ కొండారెడ్డి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ల చొరవతో నూతన ఆలయ పునర్నిర్మాణానికి 14.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు దారుబింబబాలాలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు
ఈనెల 24న గండి క్షేత్రానికి అహోబిలం, శారదా పీఠాల పీఠాధిపతుల రాక
చక్రాయపేట వైసిపి మండల ఇన్చార్జి వైయస్ కొండారెడ్డి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ల చొరవతో నూతన ఆలయ పునర్నిర్మాణానికి 14.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు దారుబింబబాలాలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు
పులివెందుల,(నిఘా ప్రతినిధి) : కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రాయపేట మండలం మారెళ్ళ మడక గ్రామంలో వెలసిన శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఈనెల 24వ తేదీన అహోబిలం పీఠాధిపతి శ్రీ ఆది వన్ శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి, శారదా పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి లు రానున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఈనెల 24వతేదీ నుంచి 27వ తేదీ వరకు దారు బింబ బాలాలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చేపట్టనున్న యజ్ఞ కార్యక్రమాలలో వీరు పాల్గొననున్నారు. శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమం సందర్భంగా దారుబింబా బాలాలయ ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆంజనేయస్వామి ఆలయ న్ని పూర్తిగా తొలగించి ఆ స్థానంలో నూతన ఆలయ నిర్మాణానికి సంబంధించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని చక్రాయపేట మండలం మారెళ్ళ మడక గ్రామంలో వెలసిన శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఈనెల 24వ తేదీన అహోబిలం పీఠాధిపతి శ్రీ ఆది వన్ శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి, శారదా పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి లు రానున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఈనెల 24వతేదీ నుంచి 27వ తేదీ వరకు దారు బింబ బాలాలయ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చేపట్టనున్న యజ్ఞ కార్యక్రమాలలో వీరు పాల్గొననున్నారు. శ్రీ గండి వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణ కార్యక్రమం సందర్భంగా దారుబింబా బాలాలయ ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఆంజనేయస్వామి ఆలయ న్ని పూర్తిగా తొలగించి ఆ స్థానంలో నూతన ఆలయ నిర్మాణానికి సంబంధించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.