విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అగనంపూడి లో కొవ్వొత్తుల ప్రదర్శన:
అఖిల పక్షాలు నాయకులు

    అగనంపూడి జాతీయ రహదారి పక్కన కొవ్వొత్తుల నిరసన తెలిపి అనంతరం జరిగిన సమావేశంలో , ప్రజా వేగు నిర్వాసిత నాయకుడు పట్టా రామ అప్పారావు  ప్రసంగిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు   32 మంది ప్రాణ త్యాగాల తో  విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను స్థాపించడం జరిగింది అని అటువంటి స్టీల్ ప్లాంట్ నేడు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.  అగనంపూడి అభివృద్ధి కమిటీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ప్రసంగిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాలుగు శతాబ్దాలు అవుతున్నప్పటికీ ప్లాంట్ నిర్మాణానికి ఇల్లు భుములు త్యాగం చేసిన నిర్వాసితులకు సంపూర్ణ న్యాయం జరగలేదు.  స్టీల్ ప్లాంట్ కు  గనులు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కేటాయించకపోవడం విచారకరం అని అన్నారు .   కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం లో పాల్గొన్న అఖిలపక్ష నాయకులు మడగల నర్సింగరావు. బలిరెడ్డి శ్రీను. బోను అప్పలనాయుడు. బుది రెడ్డి అప్పారావు .పిల్ల త్రినాథ్.  జాజుల అప్పారావు. పట్టా నర్సింగ్ రావు‌ దువ్వాడ గణేష్. నక్క లక్ష్మి. పిల్ల కుమారి .స్థానిక నిర్వాసితులు పాల్గొన్నారు