విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఈ నెల 15 న జంతర్ మంతర్ వద్ద దీక్ష చలో ఢిల్లీ : కర్రి వేణుమాధవ్

 


విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఈ నెల 15 న జంతర్ మంతర్ వద్ద దీక్ష చలో ఢిల్లీ : కర్రి వేణుమాధవ్

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కర్రి వేణుమాధవ్ ఈ నెల 15న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు ,ఇప్పటికే గతంలో నాలుగుసార్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా విభజన హామీల కోసం నిరాహారదీక్ష బీసీ కర్రి వేణుమాధవ్  చేయడం జరిగిందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత సమయం ఇవ్వాలనే ఆలోచనతో ఇప్పటివరకు ఉద్యమాల్ని కొంత సమయం ఇచ్చామని కానీ ఇప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని సంబంధించి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ ఆవేశంతో ఉన్నారని ఆంధ్రప్రదేశ్కి ఇంత అన్యాయం జరుగుతుంటే పార్టీనే అంటిపెట్టుకొని కూర్చోవడం కంటే ప్రత్యక్ష పోరాటానికి దిగాలి అని ఆయన పిలుపునిచ్చారు 

 మాజీ మంత్రి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు గారి రాజీనామా నిర్ణయాన్ని బీసీ సంఘాలు స్వాగతిస్తున్నాయి ఇదే బాటలో మిగతా రాజకీయ పార్టీలు  ముందుకొచ్చి  విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం కాకుండా కాపాడుకునే విధంగా ఉద్యమాలు చేపట్టాలని ఆయన కోరారు