" వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం"


భూవివాదాలకు శాశ్వత పరిష్కారం - 

" వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం"

"మీ భూమి - మా హామీ" కార్యక్రమం భీమిలి లో ప్రారంభించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్

 భీమునిపట్నం మండలం రామయోగి అగ్రహారం గ్రామంలో మీ భూమి- మా హామీ  కార్యక్రమం ప్రారంభమైంది.

తొలుత గ్రామ భూముల వివరాలు పరిశీలించి, డ్రోన్ లచే భూములు సర్వే చేయడాన్ని ప్రారంభించి, సర్వే హద్దు రాయిని భూమిలో పాతారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీ నివాసరావు మాట్లాడుతూ  వైఎస్సార్ జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పథకం లో భూముల సర్వే చేయడం వలన భవిష్యత్తులో ఎవరి భూములు ఆక్రమణకు గురికావని తెలిపారు.

కులం, మతం, వర్గ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందని అన్నారు.

అవినీతి రహిత పాలన నందిస్తూ దేశంలో  ఉత్తమ ముఖ్యమంత్రి గా  4 వ స్థానంలో నిలిచారని అన్నారు.

త్వరలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారానికి సచివాలయ వ్యవస్థ ను నెలకొల్పినట్లు తెలిపారు.

భౌగోళిక వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలు సంరక్షిస్తామని తెలిపారు.

నిడిగట్టు పంచాయతీ లోని 1300 మంది ప్రజలు ఈ ప్రభుత్వం లో ఇప్పటివరకు 22 పథకాల ద్వారా రూ.8.62 కోట్లు లబ్ది పొందారని తెలిపారు.

తరువాత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు  భూమిని శాశ్వత వనరుగా ఉంచుకోవాలని, తాత్కాలిక అవసరాల కోసం అమ్ముకోరాదని అన్నారు.

భూమిని నమ్ముకున్న వారెప్పుడూ నష్టపోరని అన్నారు.

భూమి సర్వే కార్యక్రమం నిజమైన యజమానికి శాశ్వత భూ హక్కు కల్పిస్తుందని తెలిపారు.

భూకబ్జా దారులకు చట్టం అంటే భయం లేకుండా పోయిందని అన్నారు.

గ్రామ ఉమ్మడి అవసరాలకు కేటాయించిన భూములను ఎవరైనా ఆక్రమిస్తే, ప్రజలు ధైర్యంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాటిని కాపాడుకోవాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ గతంలో 1920 లో బ్రిటీష్ పరిపాలన లో భూ సర్వే జరిగిందని, మళ్ళీ 100 సంవత్సరాల తరువాత ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, పూర్తి స్థాయిలో సర్వే చేస్తారని తెలిపారు.

ముఖ్యమంత్రి  సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా, సర్వే సెటిల్ మెంట్ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, స్థానిక సంస్థలు పంచాయతీ, పురపాలక శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

 జిల్లా లో మొదటగా  సర్వే ఈ గ్రామం నుండే ప్రారంభిస్తున్నామని తెలిపారు.

భూమి  సర్వే డ్రోన్ ల సహాయం తో నిమిషాలలో పూర్తి చేస్తామని,  ఒక సెం..మీ కూడా తేడా లేకుండా కొలిచే యంత్రాలు ఉన్నాయని తెలిపారు.

రైతులు, ప్రజల సహకారం అవసరం అని, 

సర్వే సమయం లో రైతులు వారి సమస్యలు, అభ్యంతరాలు తెలియ జేసి వారి భూములకు సరైన హద్దుల తో పత్రాలు పొందాలని అన్నారు.

 జిల్లా లో సర్వే 3 విడతలుగా జరుగుతుందని, 

 మొదటి విడత లో 920 గ్రామాలు, రెండవ విడత లో 1012 గ్రామాలు, మూడవ విడతలో మిగిలిన 1000 గ్రామాలు పూర్తి చేస్తారని తెలిపారు.

సర్వే పూర్తి అయిన తరువాత భూమి పై శాశ్వత హక్కు కల్పిస్తామని, " కంక్లూజివ్ టైటిల్ " ఇస్తామని తెలిపారు. 

 అత్యంత ఖచ్చితమైన భూ అక్షాంశ - రేఖాంశాలతో భూ కమత పటం ఇస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ఆర్డీవో పి. కిషోర్, సర్వే శాఖ సహాయ సంచాలకులు  విజయ్ కుమార్, తహసీల్దార్ ఈశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.