ఆంద్రప్రదేశ్ వెనుకబడిన కులాల సంక్షేమం సేవ సంఘం నూతన కమిటీ
ఏపీలో వెనుకబడిన కులాల సంక్షేమం కోసం విశాఖ వేదికకగా వెనుకబడిన కులాల సంక్షేమ సేవ సంఘం కార్యాచరణ అమలు చేస్తోంది.రాష్ట్రంలో ఆర్దికంగా చితికిపోతున్న సామాజిక వర్గాలు ఉన్న వారిని ఆదుకోవడంతో పాటుగా వారికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించేలా సంఘం కృషి చేస్తోంది.ఈ క్రమంలో నగరంలో జగదాంబ జంక్షన్ లో గల అసోసియేషన్ కార్యాలయంలో సమావేశమైన సంఘం సభ్యులు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు.వెనుకబడిన కులాల అభ్యుదయం కోసం ప్రభుత్వ పధకాలను వినియోగించేలా తమ సంఘం అండగా నిలుస్తుందని సంఘం అధ్యక్షులు కంటుముంచు తాతారావు అన్నారు.ప్రభుత్వం కూడా వెనుకబడిన కులాల సంక్షేమం కోసం తగిన చర్యలు తీసుకోవాలని విజ్నప్తి చేశారు.
ఈ సందర్భంగా నూతన కమిటి ని ప్రకటించారు...
అధ్యక్షుడుగా కంటుముంచు తాతారావు ,
ఉపాధ్యక్షులు గా ముల్లువలస జగదీశ్వర రావు, కదిరి అప్పారావు (ఎక్స్ కార్పొరేటర్)
అలెటి హేమలత (మాజీ కార్పొరేటర్)
పినకోతు సత్తిబాబు(మాజీ కార్పొరేటర్)
వ్యవస్థాపక కార్యదర్శిగా కొణతాల వెంకట శ్రీనివాస్
కార్యదర్శులుగా
నాయుని గోవింద్ రెడ్డి
కండిపిల్లి నర్సింహ రావు
కండిపిల్లి సతీష్
తెర్లాంగి హరి
సహా కార్యదర్శిలుగా
బొడ్డు లోవ రాజు
గుర్తుర్తి ఈశ్వర రావు
నిర్వాహక కార్యదర్శిలు
బోధల రమేష్ బాబు
కొయ్య రామకృష్ణ
అంగటి రమణ
కోశాధికారి గా మళ్ల పైడిరాజు లను
నూతన కమిటిగా ప్రకటించారు