గతోరెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాల వల్ల గాజువాక డలంలోని పలు ఇళ్లు కూలిపోయాయి మంగళవారం సీ.పీ.ఐ నగరసమితి ఆధ్వర్యంలో గాజువాక మండల పరిధిలోని సంజీవగిరి కాలనీ, భానోజీ కాలనీ లోని పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను నాయకులు పరిశీలించారు. నేలమట్టమైన ఇళ్ల యజమానులను సీ.పీ.ఐ నేతలు పరామర్శించి వివరాలను తెలుసుకున్నారు. వాయుగుండం వలన రెండు రోజులుగా గాజువాక లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ఇళ్లు వర్షానికి దెబ్బతిన్నాయి సంజీవగిరి కాలనీ, భానోజీ కాలనీ లో ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న బాధితులు మునసా పెంటమ్మ, వరలక్ష్మి తదితరుల ఇళ్లను సీ.పీ.ఐ నగర సమితి కార్యదర్శి మరిపల్లి పైడి రాజు, సహాయ కార్యదర్శి కె.సత్యాంజనేయ, కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ, జి.రాంబాబు, పి.దుర్గారావు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా పైడి రాజు మాట్లాడుతూ ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు.
బాధితులకు సీ.పీ.ఐ నేతల పరామర్శ