దేశ ప్రజలకు ప్రధాన మంత్రి మోడీ సందేశము

 



 


దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు.మరోవైపు ప్రజలు కరోనా నిబంధనలను నిర్లక్ష్యం చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలను పాటించకపోతే ఏమవుతుందో గుర్తు చేస్తూ వార్నింగిచ్చారు పీఎం. వ్యాక్సిన్ వచ్చేదాకా అలసత్వం వద్దని.. దేశ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు కరోనాతో సహజీవనం చేస్తున్నామంటూ నిబంధనల పాలనలో అలసత్వం వద్దని హెచ్చరించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దసరా వంటి పెద్ద పండుగలొచ్చాయ కదా అని మాస్కులను పక్కన పెట్టేయడం, రెండు గజాల దూరాన్ని పాటించకపోవడం, సబ్బుతో తరచూ చేతులను కడుక్కోకపోవడం వంటివి చేస్తే కరోనా మళ్ళీ విజృంభించే ప్రమాదం వుందని మోదీ వార్నింగ్ ఇచ్చారు. యూరప్ దేశాలలో కరోనా కంట్రోలైందన్న నమ్మకంతో యధేచ్ఛగా ప్రవర్తించారని, ఆయా దేశాలిపుడు రెండో దశ కరోనా విజృంభణతో వణికిపోతున్నాయని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రజల్లో కనిపిస్తున్న నిర్లక్ష్యంపై ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన జాతినుద్దేశించే ప్రసంగించారు. కరోనాపై అలసత్వం వద్దని దేశప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా పూర్తిగా అంతమయ్యే దాకా అలసత్వం వద్దని ఆయన చెప్పారు. కరోనా నిబంధనలను పాటించకపోతే తమ ప్రాణాలతోపాటు తమ కుటుంబ సభ్యుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేస్తున్నామన్న సంగతి విస్మరించవద్దని మోదీ హెచ్చరించారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుకొనేందుకు ప్రపంచ దేశాలు పని చేస్తున్నాయని, భారత్ కూడా వ్యాక్సిన్ రూపకల్పనలో చక్కని ఫలితాలు సాధిస్తోందని మోదీ అన్నారు. దేశంలో పలు లాబోరేటరీలు వ్యాక్సిన్‌పై ప్రయోగాలు చేస్తున్నాయని, అవి విజయవంతం కాగానే దేశంలో ప్రతీ పౌరునికి కరోనా వ్యాక్సిన్ అందించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోందని ప్రధాన మంత్రి వివరించారు. వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్‌పై అధికారయంత్రాం కార్యాచరణ రూపొందిస్తోందని మోదీ చెప్పారు. అయితే ఎప్పటి దాకా వ్యాక్సిన్ రాదో అప్పటి దాకా నిర్లక్ష్యం వద్దని, ఏ మతస్థులైనా వారికి తమ పండుగలెప్పుడు ప్రత్యేకమైనవే కానీ ప్రస్తుతం చాలా క్లిష్టమైన దశ నడుస్తోందన్న సంగతి విస్మరించవద్దని ప్రధాన మంత్రి సూచించారు. పండుగలొచ్చాయంటూ కరోనా నిబంధనలను విస్మరించవద్దన్నారు. దసరా అయినా, దీపావళి అయినా, ఈద్ అయినా, క్రిస్మస్ అయినా.. ఛత్ పూజలైనా కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను అధిగమిస్తూ ముందుకు వెళితేనే జీవన సాఫల్యం కలుగుతుందన్న ప్రధాన మంత్రి.. మాస్క్ ధరించడం, రెండు గజాల దూరం పాటించడం, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ఈ నిబంధనల అవసరాన్ని దేశప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు, ప్రతీ ఒక్కరిలో అవగాహన పెంచేందుకు మీడియా, సోషల్ మీడియా ప్రయత్నించాలని మోదీ కోరారు.


 


 


 


Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం