బేస్తవారిపేట: యూట్యూబ్ ఛానళ్లను చిన్న చూపు చూస్తూ, నేను పనిచేసే ఛానలే పెద్దది అంటూ అవహేళన చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం ప్రకాశం జిల్లా బేస్తవారిపేట, కంభం, అర్థవీడు మండలాలకు చెందిన యూట్యూబ్ ఛానళ్లల్లో పని చేసే మీడియా ప్రతినిధులు బేస్తవారిపేట ఎస్సై బాలకృష్ణ కు వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. కంభం మండలానికి చెందిన 10టీవీ రిపోర్టర్ సుబాని అనే వ్యక్తి సెప్టెంబర్ 18వ తేదీన పోలీస్ & ప్రెస్ గ్రూపులో యూట్యూబ్ ఛానళ్ల ను తక్కువ చేస్తూ మెస్సేజ్ లు చేశాడని, ఇలా తోటి రిపోర్టర్ల ను కించపరచడం సరైన పద్ధతి కాదని, అతను అలా మెస్సేజ్ లు చేయడం వలన యూట్యూబ్ ఛానళ్లల్లో పని చేసి తోటి విలేకరులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, మరోసారి ఇలా జరగకుండా అతనిపై చర్యలు తీసుకోవాలని బేస్తవారిపేట, కంభం, అర్థవీడు మండలాలకు చెందిన యూట్యూబ్ లో పని చేస్తున్న రిపోర్టర్లు బేస్తవారిపేట ఎస్సై బాలకృష్ణ కు వినతిపత్రం అందజేసి తమకు తగు న్యాయం చేయాలని విన్నవించుకున్నారు. స్పందించిన ఎస్సై బాలకృష్ణ సమస్యను వెంటనే పరిష్కరిస్తాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట, కంభం, అర్థవీడు మండలాల విలేకరులు పాల్గొన్నారు.