మారేడుమిల్లి వద్ద రోడ్డుప్రమాదం:ముగ్గురి మృతి
తూర్పుగోదావరి,(మారేడుమిల్లి): తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని మారేడుమిల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణలోని పాల్వంచకు చెందిన కారులో ఐదుగురు యువకులు మారేడుమిల్లికి విహారయాత్రకు బయలుదేరారు. మారేడుమిల్లికి సుమారు 5కి.మీల దూరంలోని హెచ్‌ఎన్‌టీసీ వద్దకు రాగానే యువకులు ప్రయాణిస్తున్న కారు వేగంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను విజయవాడకు చెందిన పులి ప్రవీణ్‌కుమార్(24), పూర్ణసాయి(23)గా గుర్తించారు. గాయపడ్డవారిలో కొత్తగూడెంకు చెందిన లవంగు భరత్(24), పాల్వంచకు చెందిన నదీర్‌బాషా(23), కొత్తగూడెంకు చెందిన షేక్ ఆసిఫ్(24) ఉన్నారు. క్షతగాత్రులను మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందిస్తున్నారు. మారేడుమిల్లి సీఐ ఏఎస్‌ఎల్ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు