హిందూ దేవాలయాలపైనా, దేవతామూర్తుల పైన, ఉత్సవ రథాల పైన జరుగుతున్న దాడులకు నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఉంటుంది. ఇటీవల అంతర్వేది ఉత్సవ రథం దగ్ధం కావడంపై శాంతియుతంగా నిరసన తెలియజేసిన భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసినందుకు, శాంతియుతంగా నిరసన తెలియజేసేందుకు కూడా అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని, నిరసన తెలిపేందుకు అంతర్వేది వెళ్లేందుకు సిద్ధపడిన భారతీయ జనతా పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేయడం పౌరహక్కులు భంగం కలిగించడమే అని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక మతానికే కొమ్ము కాయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎటువంటి కారణం లేకుండా భారతీయ జనతా పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడమే కాకుండా వారిని అవమానించే విధంగా ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతర్వేది ఘటనలో అరెస్ట్ అయిన వారిపై మోపిన పలు కేసులను భేషరతుగా రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా శాఖ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, లేనియెడల నిరసన దీక్షలు ఉధృతం చేస్తామని తెలుపుతూ, శాంతియుతంగా ధర్మపోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకులపై పోలీసులు నిఘా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా
• nigha9999@gmail.com