అమరావతి,( నిఘా ప్రతినిధి ): జాతీయ స్థాయిలో రబీ పంటల జోనల్ కాన్ఫరెన్స్ అన్ని రాష్ట్రాల వ్యవసాయ కమీషనర్లతో భారత ప్రభుత్వం తరుపున జాయింట్ సెక్రటరీ (ఐ.ఎన్.ఎమ్) అడిదం నీరజ, వ్యవసాయ శాఖ మరియు ఎరువుల శాఖ ఉన్నతాధికారులు వివిధ రాష్ట్రాలకు అవసరమైన ఎరువులపై సమీక్షా సమావేశం లొ అన్ని రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాల యొక్క రబీ పంటల విస్తీర్ణం, పండించే పంటలు , భూసార పరిస్థితులను అనుసరించి (ఎన్.పి.కె మరియు సూక్ష్మ పోషకాల లభ్య పరిస్థితులు) మరియు గత 5 సంవత్సరాల వివిధ ఎరువుల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని వివిధ రాష్ట్రాలకు రసాయనిక ఎరువులైన యూరియా, డి.ఎ.పి, ఎమ్. ఓ.పి. ఎస్.ఎస్.పి మరియు కాంప్లెక్స్ ఎరువులను ఆయా రాష్ట్రాల కమీషనర్లతో చర్చించి ఎరువుల శాఖ భారత ప్రభుత్వం వారి సూచనల మేరకు కేటాయించడం జరిగినది. ఈ సమావేశంలో ఎరువుల వాడకాన్ని తగ్గించే దిశగా రాష్ట్రాలు రైతులను చైతన్య పరిచి సేంద్రియ వ్యవసాయన్ని ప్రోత్సహించవలెనని మరియు సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంపొందించవలెనని తెలిపారు. రబీ 2020-21 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి 8.05 లక్షల హెక్టార్లు, శనగ 4.03 లక్షల హెక్టార్లు, మినుము 3.85 లక్షల హెక్టార్లు, పెసర 1.36 లక్షల హెక్టార్లు, జొన్న 1.22 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 2.02 లక్షల హెక్టార్లు నువ్వులు 0.33 లక్షల హెక్టార్లు, వేరుశనగ 0.99 లక్షల హెక్టార్లు, ప్రొద్దుతిరుగుడు 0.12 లక్షల హెక్టార్లు, రాగి 0.15 లక్షల హెక్టార్లు, పొగాకు 0.88 లక్షల హెక్టార్లు, మిరప 0.24 లక్షల హెక్టార్లు మరియు ఇతర వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు కలుపుకొని మొత్తం 43. 15 లక్షల హెక్టార్లుగా అంచన.మన రాష్ట్రంలో 79.80 శాతం నేలలలో నత్రజని లభ్యత తక్కువగాను, 15.80 శాతం నేలలలో లభ్యత భాస్వరం తక్కువగాను మరియు 14.71 శాతం నేలలలో పొటాష్ లభ్యత తక్కువగాను ఉన్నవి. సూక్ష్మపోషకాలైనా జింక్ 35 శాతం నేలలలోను, ఐరన్ 24 శాతం నేలలలోను, బోరాన్ 17 శాతం నేలలలోను, మాలిబ్డినం 14 శాతం నేలలలోను లభ్యత తక్కువగా ఉన్న. మన రాష్ట్రం యొక్క పంటల విస్తీర్ణం పోషకాల లభ్యత మరియు గత 3 సంవత్సరాల ఎరువుల వినియోగాన్ని బట్టి 25 లక్షల వివిధ రకాల ఎరువుల అవసరాన్ని ప్రతిపాదించగా, ఎరువుల శాఖ భారతదేశ ప్రభుత్వం వారు మన రాష్ట్రానికి యూరియా 10.0 లక్షల మెట్రిక్ టన్నులు, డి.ఎ.పి. 2.0 లక్షల మెట్రిక్ టన్నులు, ఎమ్. ఓ.పి. 1.60 లక్షల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 8.5 లక్షల మెట్రిక్ టన్నులు, ఎస్.ఎస్.పి. 1.00లక్షల మెట్రిక్ టన్నులు (మొత్తం 23.1 లక్షల మెట్రిక్ టన్నులు) కేటాయించబడినదని వ్యవసాయ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ తెలిపారు.