‘ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ 87 రకాల సేవలు

 



దేశంలోనే తొలిసారిగా ఏపీ పోలీస్‌ శాఖ సరికొత్త యాప్‌ను రూపొందించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ స్టేషన్‌‌కు వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు 87 రకాల సేవలను పొందేలా ప్రత్యేకంగా ‘ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.పోలీసు స్టేషన్‌ ద్వారా లభించే అన్నిరకాల  సేవలను ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చు. అన్ని నేరాలపై ఫిర్యాదులు చేయొచ్చు..అంతే కాకుండా ఫిర్యాదులకు రశీదు కూడా పొందే విధంగా  యాప్ ను రూపొందించారు. పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనున్న ఈ ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌.


ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ అందించే సేవలు: 


• దర్యాప్తు పురోగతి, అరెస్టులు, ఎఫ్‌ఐఆర్‌లు, రికవరీలు,  రహదారి భద్రత, సైబర్‌ భద్రత, మహిళా భద్రత, వివిధ కార్యక్రమాలకు అనుమతు, ఎన్‌వోసీలు, లైసెన్సులు, పాస్‌పోర్ట్‌ సేవలు, ఇతర వెరిఫికేషన్లు ఇలా అన్ని పోలీసు సేవలను యాప్‌ ద్వారా పొందవచ్చు.  • ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌‌ నుంచే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసర సమయాల్లో  వీడియో కాల్‌ చేస్తే పోలీస్‌ కంట్రోల్‌ రూంకు వెంటనే సమాచారం వెళ్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే సమాచారాన్ని నిర్థారించుకునే సౌకర్యం. 


• ఈ యాప్‌లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా  12 మాడ్యూల్స్ తో  ' మహిళల కు రక్షణగా , తోడు నీడగా అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణ ఉన్నారు అనే భావనతో వారిలో ఆత్మస్థైర్యాన్ని  కల్పించే విధంగా ఈ యాప్ సేవలను అందిస్తుంది. 


• రాష్ట్రం లోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీ తో ప్రవేశ పెట్టిన  దిశ మొబైల్ అప్లికేషన్ (SOS)  స్వల్ప వ్యవధి లోనే  పదకొండు(11) లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. 568  మంది నుండి  ఫిర్యాదులు స్వీకరించగా 117 యఫ్.ఐ.ఆర్ లను నామోదు చేసి చర్యలు తీసుకున్నాము. 


• ఆపదలో ఉన్న మహిళలకు తక్షణమే పరిష్కరించటం కోసం ఇప్పటికే  సైబర్‌ మిత్ర ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ 9121211100 మరియు ఫేస్ బుక్ పేజ్ అందుబాటులో ఉంది.ఇప్పటివరకు 1,850 పిటిషన్ లు అందగా 309 యఫ్.ఐ.ఆర్ లు నమోదు చేసి చర్యలు తీసుకున్నాం.  
 
• సైబర్ నేరాలను నియంత్రించేందుకు అత్యాధునిక టెక్నాలజీతో సైబర్‌ల్యాబ్స్‌ను అందుబాటులోకి తెచ్చాము. 


• రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కు  వీడియో కాన్ఫరెన్స్  సౌకర్యం.అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో కూడా  రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ ఎన్‌హాన్స్‌మెంట్ వెహికల్స్ (రేస్) విధానం. నిరంతర నిఘా  కోసం డ్రోన్‌ల నుండి  ప్రత్యక్ష ప్రసారం.


• అన్ని పోలీసు స్టేషన్లకు మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పరికరాలు .ఇప్పటికే అందుబాటులో  బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ (BWC) పరికరాలు. 


• స్వల్ప సమయంలో అత్యంత వెనుకబడిన ప్రాంతానికి చేరుకునే విధంగా ఇప్పటికే 3500 వాహనాలను జీపీఎస్ పరికరాలు & స్మార్ట్‌ఫోన్‌లతో అనుసంధానం


• సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ఈ సంవత్సరం ఇప్పటికే 37  అవార్డులను దక్కించుకుంది. 



• ఇప్పటికే అందుబాటులో  బాడీవోర్న్ కెమెరాల లైవ్ స్ట్రీమింగ్ (BWC) పరికరాలు.


•  పోలీస్ స్టేషన్, జైళ్లు మరియు గణనలు (ఐసిఎస్) ఇంటిగ్రేషన్. డిజిటల్ కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ (డిజిటల్ మొబైల్ రేడియో రిపీటర్లు & మ్యాన్‌ప్యాక్‌లు)


• ఆరు విభాగాల్లో ఏపీ పోలీస్‌ సేవ’యాప్‌ 87 రకాల సేవలు


శాంతి భద్రతలు.. 
♦నేరాలు, వేధింపులపై ఫిర్యాదులు 
♦ఎఫ్‌ఐఆర్‌ స్థితిగతులు, డౌన్‌లోడ్‌ 
♦దొంగతనం ఫిర్యాదులు/ రికవరీలు 
♦తప్పిపోయిన కేసులు /దొరికిన వారు/గుర్తు తెలియని మృతదేహాలు 
♦అరెస్టుల వివరాలు 
♦వాహనాల వివరాలు 


ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సేవలు.. 


• ♦ఇంటి పర్యవేక్షణ(లాక్‌మానిటరింగ్‌ సర్వీసు(ఎల్‌ఎంఎస్‌) , ఇ–బీట్‌) 
♦ఇ–చలానా స్టేటస్‌ 
పబ్లిక్‌ సేవలు.. 
♦నేరాలపై ఫిర్యాదులు 
♦సేవలకు సంబంధించిన దరఖాస్తులు 
♦ఎన్‌వోసీ, వెరిఫికేషన్లు 
♦లైసెన్సులు, అనుమతులు 
♦పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ 
 
రహదారి భద్రత.. 
♦బ్లాక్‌ స్పాట్లు 
♦యాక్సిడెంట్‌ మ్యాపింగ్‌ 
♦రహదారి భద్రత గుర్తులు 
♦బ్లడ్‌ బ్యాంకులు, డయాలసిస్‌ కేంద్రాలు, ఆసుపత్రులు, మందుల దుకాణాల వివరాలు
 
ప్రజా సమాచారం.. 
♦పోలీస్‌ డిక్షనరీ 
♦సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ 
♦టోల్‌ఫ్రీ నంబర్లు 
♦వెబ్‌సైట్ల వివరాలు 
♦న్యాయ సమాచారం 
♦ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు 


ప్రజా సమాచారం.. 


♦పోలీస్‌ డిక్షనరీ 
♦సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ 
♦టోల్‌ఫ్రీ నంబర్లు 
♦వెబ్‌సైట్ల వివరాలు 
♦న్యాయ సమాచారం 
♦ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లు


Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం