విశాఖపట్నం, (నర్సీపట్నం) :బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సీపీఐ నాయకులు కేంద్రంలో వ్యవసాయ బిల్లులను ఏకపక్షంగా ఆమోమోదించిన బీజేపీ ప్రభుత్వం మోడీ వైఖరి నశించాలంటూ నినాదాలు, స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలేపల్లి వెంకట రమణ మాట్లాడుతూ అధికార మాదంతో ఉరేగుతున్న బీజేపీ ప్రభుత్వం అన్నదాతల కడుపు కొట్టే చట్టాలను తీసుకొస్తుందని దానికి నిరసిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశామన్నారు.ఈ దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ రైతుల మెడకు ఉరి బిగిస్తూ రెండు చట్టాలను తీసుకువచ్చిందని, వీటినే వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాలతో నడుస్తున్న ఎల్ ఐ సి, రైల్వే, ఎయిర్ పోర్టులు వంటి సంస్థలను వేలం వేసి అమ్ముకుంటు వచ్చారన్నారు.ఆఖరికి ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలను కూడా కార్పొరేటర్లకు అమ్మి లాభాలు కూడబెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ధర్నాలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం రాము నాయుడు, జి గురుబాబు,రైతుకులి సంగం రాష్ట్ర కార్యదర్శి గంగా భవాని,మేకా సత్యనారాయణ, రాజబాబు,ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాధా కృష్ణా,రురల్ కార్యదర్శి నల్లబెల్లి శ్రీరామూర్తి పాల్గొన్నారు.
ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ నాయకులు