జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీయే నుంచి వైదొలిగే అవకాశాలు

బీజేపీ షాక్‌ రాజీనామా బాటలో డిప్యూటీ సీఎం!


న్యూఢిల్లీ : ఎన్డీయే ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పాటు ఆ పార్టీ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే అకాలీదళ్ దారిలోనే మరికొన్ని ఉత్తరాది పార్టీలు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీయే నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేజేపీ చీఫ్‌ దుశ్యంత్‌ సింగ్‌ చౌతాలా ప్రస్తుతం హర్యానా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, తాము ఇక ప్రభుత్వంలో కొనసాగలేమంటూ అకాలీదళ్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. చౌతాలా మీదకూడా ఒత్తిడి పెరుగుతోంది. కేంద్ర ప్రతిపాదిత బిల్లుపై జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీలోని కొంతమంది సీనియర్లు సైతం అధిష్టానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ సీరియర్లు, ఎమ్మెల్యేలతో చౌతౌలా సమావేశం కానున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేజేపీ నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాల కోరారు. రైతుల పక్షపాతిగా చరిత్ర కలిగిన చౌతౌలా కుటుంబం క్లిష్ల సమయంలో రైతాంగానికి అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం నుంచి వైదొలగాలని సూచించారు. మాజీ ఉప ప్రధాని, దేవీలాల్‌కు రైతు బాంధవుడిగా మంచి గుర్తింపు ఉందని, దుశ్యంత్‌ ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని ట్విటర్‌ ద్వారా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎస్‌ఏడీ, విపక్ష సభ్యుల నిరసనల మధ్య వివాదాస్పద ‘ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌(ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌)’ బిల్లును, ‘ద ఫార్మర్స్‌(ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌’ బిల్లును గురువారం మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. ఇదిలావుండగా.. 90 స్థానాలు ఉన్న హరియాణాలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. ఖట్టర్‌ నేతృత్వంలోని బీజేపీ 40 స్థానాలు సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్‌ (46)ను సొంతంగా అందుకోలేకపోయింది. దీంతో పది స్థానాలు సాధించిన దుష్యంత్‌ చౌతాలా కింగ్‌మేకర్‌గా అవతరించారు. ఈ నేపథ్యంలో జేజేపీ మద్దతుతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో జేజేపీ ప్రభుత్వం నుంచి వైదొలిగితే ఖట్టర్‌ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉంది.


Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం