మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి:

 



విశాఖపట్నం,(పశ్చిమ నియోజకవర్గం): భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో,  62వార్డు బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి కార్పోరేటర్ అభ్యర్థి  ములకలపల్లి ప్రకాష్  ఆధ్వర్యంలో, రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి హిందువులు మనోభావాలను కించపరిచిన ఆయనకు సరైన  శిక్షను విధించి, గుణపాఠం నేర్పించు స్వామి అని ప్రార్ధిస్తు,  నిరసనగా కార్యక్రమం చేపట్టి, స్థానిక ఆంజనేయస్వామి గుడిలో స్వామివారికి వినతిపత్రం సమర్పించారు  అనంతరం ఒక బాధ్యత కలిగిన రాష్ట్ర మంత్రి, వైఎస్సార్సీపీ నాయకులు   కొడాలి నాని హిందూ మత విశ్వాసాలను, సంప్రదాయాలను అగౌరవపరిచే విధంగా, హిందూ  దేవుళ్ళను కించపరుస్తూ రెచ్చగొట్టే విధానంగా చేసిన వ్యాఖ్యలపై నిరసిస్తూ ఆయన తక్షణమే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  డిమాండ్ చేస్తూ, ఆయనపై పై చట్టపరమైన చర్యలను  భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295,295a మరియు 153a సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని, పారిశ్రామిక ప్రాంతంలో మల్కాపురం పోలీస్ స్టేషన్లో  పారిశ్రామిక ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి సి.ఐ.  దుర్గాప్రసాద్ గారికి ఫిర్యాదు చేయడమైనది.కొడాలి నాని  ఎన్.టీవీ ఇంటర్వ్యూ లో చేసిన అనుచిత వ్యాఖ్యలు, హిందూదేశంలో జన్మించి, ఒక హిందువు అయ్యుండి, సాక్షాత్తూ  తిరుమల వేంకటేశ్వరుని పేరు పెట్టుకున్న మీరు ఆ స్వామి వారి సంప్రదాయాలను కించపరిచడం క్షేమించరాని ద్రోహం.  మనకు ఎక్కడైనా త్రవ్వకాలలో పురాతన విగ్రహాలు దొరికితే, వాటిని శుభ్రపరిచి గుడిని కట్టి పూజించే సంప్రదాయం మనది.అలాంటి దేశంలో పుట్టిన ఈ కొడాలి నాని ఒక మంత్రిగా అంతర్వేది రథం కాలిపోతే కోటి రూపాయలతో మరో రథం చేయించి ఇస్తాం, శ్రీ షిర్డీ సాయిబాబా విగ్రహానికి తల విరిగితే సాయిబాబాకు ఏమిటి నష్టమని, ఆంజనేయస్వామి విగ్రహానికి చెయ్య విరిగితే ఆంజనేయస్వామికి ఏమి నష్టమని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధికంగా అండదండలు అందిస్తు,  కామధేనువులా నిత్యం కనక వర్షం కురిపిస్తున్న, పవిత్ర పురాతన  హిందూ దేవాలయాలు, విగ్రహాలను చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన బాధ్యత మన ప్రభుత్వాలపై ఉంది. అలాంటి ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ, ఇటువంటి నీతిమాలిన వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. అలాంటి మంత్రి నాని గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో  చుక్కా శ్రీనివాసరెడ్డి(ఆర్.ఎస్.ఎస్), 60వార్డు,  జీ. శరత్ చంద్ర గుప్తా(బి.ఎమ్.ఎస్.)58వార్డు వజ్రాపు  ధనుంజయ్ 63వార్డు, డా. ముఖేష్ ఠాకూర్ 62వార్డు,  ఆకాష్ కుమార్ 61వార్డు,  మడక రమణ,  అభినయ్ 59వార్డ్ బిజెపి నాయుకులు, కార్యకర్తలతో  నగేష్ జనసేన నుంచి పాల్గొన్నారు.