కొడాలి నాని వ్యాఖ్యలపై చట్టమైనా చర్యలు

 


విశాఖపట్నం,(మల్కాపురం) : హిందూ మత విశ్వాసాలను ఆగౌరవిస్తూ, దేవుళ్ళను కించపరుస్తూ, రెచ్చగొట్టే విధమైన వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు ( కొడాలి నాని) వ్యాఖ్యలపై చట్టమైనా చర్యలు తీసుకొనుట కొరకు స్థానిక మల్కాపురం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగినది. ఈ ఫిర్యాదులో  కొడాలి నాని పై భారతీయ శిక్షాస్మృతిలోని 295,  295a, మరియు 153 ఏ సెక్షన్ ల పై కేసు నమోదు చేయవలసిందిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారిని కోరడమైనది.  కొడాలి నాని  గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉంటూ హిందూ దేవతా మూర్తులు పై టీవీ మాధ్యమంగా దుర్భాషలాడుతూ హిందూ దేవుళ్లను కించపరుస్తూ ఇందు వలన మా మనోభావాలు దెబ్బతినేలా గా ఉద్దేశపూర్వకంగా మరియు దురుద్దేశంతో మతవిశ్వాసాలను అగౌరవపరిచి సమాజంలో మతసామరస్యం దెబ్బతినే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్లను హిందూ భక్తులను అవమాన పరిచారు అందువలన సదరు మంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వెంటనే అతని ని మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో పొలిమేర శ్రీనివాసరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర దళిత మోర్చా ఉపాధ్యక్షులు కొక్కిలిగడ్డ విజయబాబు, భగవాన్, యువ మోర్చా నాయకులు హేమంత్, గణపతి  పాల్గొన్నారు