మేకపాటి గౌతమ్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్ బీ ఒప్పందం నిధుల సమీకరణకు ఏ అవకాశాన్ని వదలకూడదు నైపుణ్యశాఖపై సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అమరావతి: ఆగస్ట్ 5వ తేదీన ఐఎస్ బీ - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదరనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఐఎస్ బీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐఎస్ బీ సంస్థ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి ఎంవోయూపై ప్రధానంగా చర్చించారు. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనలో వేగం పుంజుకోవడం ఖాయమని మంత్రి తెలిపారు. ఐ.టీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలతో పాటు పరిపాలన, ఉపాధి అంశాలలో ఎలాంటి సమస్యకైనా ఐఎస్ బీ వెంటనే పరిష్కారం చూపుతుందని మంత్రి ఆశాభవం వ్యక్తం చేశారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలు, ఐ.టీ సంస్థల ఏర్పాటులోనూ ఐఎస్ బీ సౌజన్యం తోడ్పాడునందిస్తుందన్నారు మంత్రి మేకపాటి. ఐఎస్ బీ భాగస్వామ్యంతో ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ముఖ్యంగా మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించే మరింత చొరవచూపడానికి తగ్గ కార్యాచరణలో ఐఎస్ బీ తో పాటు అమెజాన్ కూడా ప్రభుత్వంతో జతకడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అమెజాన్, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఐఎస్ బీ ప్రతినిధులు స్పష్టం చేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్ల మరింత ప్రభావంతమైన ఫలితాలు సాధ్యమవుతాయని ఐఎస్ బీ ప్రతినిధి ఛాట్రే తెలిపారు. మొట్టమొదటిసారిగా ఏపీతో భాగస్వామ్యమవుతున్న నేపథ్యంలో దేశంలోని మిగతా ప్రభుత్వాలు కూడా తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు మంత్రికి తెలిపారు. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం ద్వారా తమ సామర్థ్యం మరింత బలపడుతుందని, మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణంగా కృషి చేస్తామని ఐఎస్ బీ ప్రతినిధులు మంత్రికి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై చర్చలో పాల్గొన్న పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు, ఐఎస్ బీ సంస్థకు చెందిన ఫినాన్స్ , డిజిటల్ ఐడెంటెటీ, రీసెర్చ్ ఇన్షియేటివ్(DIRI) విభాగం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి,ఎక్స్ టర్నల్ రిలేషన్స్ డైరెక్టర్ డీఎన్ వీ కుమార గురు, ఇన్ఫర్మేషన్స్ సిస్టమ్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీప మణి, పబ్లిక్ పాలసీ ప్రొఫెసర్ అశ్విన్ ఛాత్రే, తదితరులు పాల్గొన్నారు.
Popular posts
26 జిల్లాలకు చట్టబద్దమైన రాజధాని పేరు చెప్పగలరా !
• nigha9999@gmail.com

అదనపు తరగతి గదులు నిర్మాణంకు శంకుస్థాపన : జడ్పీ చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్
• nigha9999@gmail.com

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
• nigha9999@gmail.com

గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
• nigha9999@gmail.com
ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయండి
• nigha9999@gmail.com
Publisher Information
Contact
nigha9999@gmail.com
31-1-1/3 opp All-India Radio Kurmannapalem
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn