నాడు  నేడు పనులకు అత్యధిక ప్రాధాన్యత:ఐటీడీఏ పి.ఓ డి.కె.బాలాజీ

 


నాడు  నేడు పనులకు అత్యధిక ప్రాధాన్యత:ఐటీడీఏ పి.ఓ డి.కె.బాలాజీ                                                               పాడేరు  : మన్యంలో నాడు నేడు నిర్మాణపు పనులు శర వేగంగా పూర్తి చేయాలని సమీకృత గిరిజాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజీ ఆదేశించారు.నాడు నేడు పనుల పురోగతి పై సోమవారం ఐటీడీఏ కార్యాలయం నుంచి  ఇంజినీరింగ్అధికారులు ,    ఏ టి డబ్ల్యు వోలు, ఎం ఈ ఓ లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో 340 పాఠశాలలు నాడు నేడు కు ఎంపిక చేసామన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు నేడు పనులు చేపట్టిందన్నారు.పనులు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు చొరవ తీసుకుని పనుల చేయించాలని చెప్పారు.నిర్మాణపు పనులకు అవసరమైన సిమెంట్, ఇతర సామాగ్రిని, పనివారిని  సమీకరించి పనులు జూన్ 12 నాటికి పూర్తి చేయాలన్నారు.వాహనాలకు, నిర్మాణ సామగ్రి దుకాణాలకు అవసరాల మేరకు అనుమతులు జారిచేస్తామని చెప్పారు.నాణ్యతల్లో ఎక్కడా రాజీ పడకుండా పనులు జరగాలన్నారు.ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ డిడి జి. విజయకుమార్. ఈఈలు కుమార్ ,మురళి , ఏటీడబ్ల్యూఓ రజని తదితరులు పాల్గొన్నారు.