భీమిలి నియోజక వర్గంలోపథకాలు అందించడంలో వార్డు వాలంటీర్లు దే  కీలకపాత్ర : పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 


భీమిలి నియోజక వర్గంలోపథకాలు అందించడంలో వార్డు వాలంటీర్లు దే  కీలకపాత్ర : పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు                        
  విశాఖపట్నం,(నిఘా ప్రతినిధి): కోవిడ్-19 నివారణలో భాగంగా లాక్ డౌన్ సమయంలో                  ఏ ఒక్కరూ ఆకలితో ఉండరాదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  గురువారం భీమిలి నియోజక వర్గంతో పాటు విశాఖపట్నం నగరంలోని కంటైన్ మెంట్ జోన్ అయిన అక్కయ్యపాలెం 80 అడుగుల రోడ్ లలో ఆయన సుడిగాలి పర్యటనలో నిత్యవసరాలను పేదవారికి పంపిణీ చేశారు.  అక్కయ్యపాలెంలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా బాగా పనిచేస్తున్నారని, అభివృద్థి పథకాలు ప్రజలకు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. వాలంటీర్లు ప్రస్తుత తరుణంలో ప్రాణాలకు తెగించి వార్డుల్లో బాగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.  ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పోలీసులు, వైద్యులు బాగా పనిచేస్తున్నారని తెలిపారు. కోవిడ్-19 సేవలు అందిస్తున్న వారికి ముఖ్యమంత్రి 50 లక్షల రూపాయలు భీమా కల్పించినట్లు వివరించారు.  అనంతరం రెండు వార్డులకు సంబంధించి వాలంటీర్లకు  నిత్యవసరాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్, విశాఖపట్నం అర్బన్ తహసిల్థార్ ఎ. జ్ఞానవేణి, తదితరులు పాల్గొన్నారు.
  సింహాచలంలోని పేదలైన అర్చకులు, అక్కడి గిరిజనులకు  25 కేజీల బియ్యం, గోధుమ పిండి, తదితరమైన కిట్లను పంపిణీ చేశారు.  లాక్ డౌన్ సమయంలో పేద అర్చకులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం 5 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఇ.ఓ. వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.  అనంతరం అక్కడ నుండి బయలుదేరి అడవివరంలో 700 మందికి నిత్యవసర సరుకులు ఆయన పంపిణీ చేశారు.   అక్కడ నుండి ఆనందపురం మండలం మామిడి లోవ గ్రామం చేరుకొని గ్రామ పంచాయితీలోని పేద వారందరికీ నిత్యవసరాల కిట్ లను  పంపిణీ చేశారు.  లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి రేషన్, ఖర్చులకు రూ.1000/-లను అందించినట్లు పేర్కొన్నారు.  గ్రామంలో సమస్యలను గూర్చి అక్కడి ప్రజలను అడుగగా తాగునీటి సమస్య ఉన్నదని చెప్పగా లాక్ డౌన్ పూర్తి అయిన వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించనున్నట్లు చెప్పారు.  అక్కడి తహసిల్థార్ ను గ్రామ సమస్యలు గూర్చి అడిగి మంత్రి తెలుసుకున్నారు.  ప్రభుత్వ పథకాలు గ్రామంలో ఎంతమందికి అందుతున్నాయని మంత్రి ఎంపిడిఓను అడుగగా గ్రామంలో పింఛన్లు 354 మందికి , అమ్మఒడి 278 మందికి, జగనన్న వసతి దీవెన 96 మందికి, ఆరోగ్య శ్రీ 841 మందికి, వాహన మిత్ర 38 మందికి, రైతు భరోసా 309 మందికి, తదితర పథకాలు మరియు లాక్ డౌన్ సమయంలో గ్రామంలో 935 మందికి రేషన్ తో పాటు ఖర్చులకు రూ.1000/-లు ఇచ్చినట్లు ఎంపిడిఓ మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్థార్ రామకృష్ణ, ఎంపిడిఓ, తదితరులు పాల్గొన్నారు.  అక్కడ నుండి మదురవాడలోని గాయిత్రీ నగర్ కాలనీలో అక్కడ గాయిత్రీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన నిత్యవసరాల సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మంత్రి పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్, తదితరులు పాల్గొన్నారు.