సున్నా వడ్డీ పథకం డ్వాక్రా మహిళలకు వరం.  : శైలజ చరణ్ రెడ్డి

సున్నా వడ్డీ పథకం డ్వాక్రా మహిళలకు వరం.  - శైలజ చరణ్ రెడ్డి


అమరావతి,( నిఘా ప్రతినిధి):  ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం నుంచి అమలు కానున్న సున్నా వడ్డీ పథకాన్ని డ్వాక్రా మహిళలు ..అన్ని సంఘాలు ఉపయోగించుకోవాలని  వైయస్సార్సీపి రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి & రీజనల్ కోఆర్డినేటర్ ,  చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జీ శైలజ చరణ్ రెడ్డి పిలుపు నిచ్చారు. కరోనా కష్టకాలంలో సున్న వడ్డీ పధకం ద్వారా మహిళలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో భరోసా కలిగిస్తున్నారని ఆమే పేర్కొన్నారు.  పొదుపు సంఘాల అప్పులకు వడ్డీ భారం ప్రభుత్వమే భరిస్తుందని సీఎం జగన్‌ హామీ ఇచ్ఛిన మేరకు డ్వాక్రా సంఘాలకు బుధవారం ఆయన లేఖలు రాయడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.  ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం’ డ్వాక్రా సంఘాలకు మరింత ఊతంగా నిలుస్తుందన్నారు. కరోనా నియంత్రణ చర్యలను అమలు చేస్తూనే సీఎం వ్యక్తిగతంగా రాసిన లేఖలను గ్రామ సమాఖ్యల ద్వారా మహిళలకు అందజేసే ఏర్పాటు జరిగిందని. ఈ నెల 24న సీఎం జగన్‌ ఈ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభిస్తారనిఅ సెర్ప్‌, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడత డబ్బులు జమ అవుతాయని సెర్ప్‌ సిఇఓ రాజారావు  తెలిపారని శైలజ రెడ్డి పెర్కోన్నారు.  తద్వారా  మొత్తం 90,37,254 మంది మహిళా సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో     రూ.1400 కోట్లు ఒకే విడత జమవుతాయని అన్నారు...      ఏ పొదుపు సంఘానికి ఎంత వడ్డీ జమచేశారనే వివరాలను లేఖలో తెలియజేస్తారని. డబ్బు జమ అయినట్లు రశీదు, ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు చేసేందుకు సెర్ప్‌, మెప్మా అధికారుల ఫోన్‌ నంబర్లు లేఖతో పాటు అందుతాయని శైలజ రెడ్డి వివరించారు....