ముఖ్యమంత్రి సహాయనిధికి 2 కోట్ల 59 లక్షల 85 వేల రూపాయలు విరాళం అమరావతి (నిఘాప్రతినిధి): నిధికోవిడ్ 19 నివారణలో భాగంగా. సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి 2 కోట్ల 59 లక్షల 85 వేల రూపాయలు విరాళం ఇచ్చిన సిమెంటు, గ్రానైట్, క్వారీ, మైన్ ఓనర్స్ అసోసియేషన్స్.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించి చెక్కును సీఎం శ్రీ వైయస్.జగన్‌కు అందజేసిన ఎస్.వెంకటేశ్వరరావు(ఛైర్మన్, ఫెడరేషన్ ఆఫ్ ఏపి గ్రనేట్ ఇండస్ట్రీస్), సిహెచ్.రావు(జనరల్ సెక్రటరీ), వై.శివప్రసాద్(కోశాధికారి), ఎం.వెంకటరావు(వైస్ ఛైర్మన్).పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామగోపాల్, డీఎంజీ వెంకటరెడ్డి.
విరాళాలు అందించిన సంస్ధలు
రోడ్ మెటల్ లీజ్ హోల్డర్స్ అండ్ క్రషర్స్ అసోసియేషన్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్.
క్వారీ అండ్ స్టోన్ క్రషర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్.
పిడుగురాళ్ల అండ్ దాచేపల్లి సెక్టార్ మైన్ ఓనర్స్ ఫోరం.
పరాశక్తి సిమెంట్ ఇండస్ట్రీస్, భవ్యా సిమెంట్స్(గుంటూరు).
గెలాక్సీ గ్రానైటీ అసోసియేషన్.
కలర్ గ్రానైటీ క్వారీ ఓనర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.
ఫెడరేషన్ ఆఫ్ ఏపీ గ్రానైట్ ఇండస్ట్రీ.