ధాన్యం అమ్మకంలో రైతులకు యిబ్బందులు ఉంటే 1902 కు ఫోన్ చెయ్యా లి: సంయుక్త కలక్టరు ఎల్. శివశంకర్
విశాఖపట్నం, (నిఘా ప్రతినిధి): ధాన్యం సేకరణకు అధికారులే రైతులవద్దకు వెళ్లి కొనుగోలు చెయ్యాలని సంయుక్త కలెక్టరు ఎల్.శివశంకర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, పౌర సరఫరాలశాఖ, సహకార సంఘాల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వై.ఎస్.ఆర్. రైతుభరోసా, ధాన్యం సేకరణ కార్యక్రమం, రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటుపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 33 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడమైనదని, 9 వేల మెట్రిక్ టన్నుల సేకరణ లక్యం నిర్దేశించడమైనదని, యిప్పటివరకు 141 మంది రైతులు తమ పేర్లు రిజిష్టరు చేసుకొన్నారని తెలిపారు. గ్రామ వ్యవసాయ సహాయకులు రైతుల పేర్లను నమోదుచేయాలని, ప్రతి రైతును రిజిష్టరు చేయాలన్నారు. రైతు ధాన్యం తీసుకువచ్చుటకు తేది, సమయం సూచిస్తూ కూపను జారీచేయాలని తెలిపారు. అధికారులే రైతు వద్దకు వెళ్లి ధాన్యం పరిశీలించి, కొనుగోలుచేయాలన్నారు. ఏరైతు గిట్టుబాటు ధరకంటే తక్కువకు అమ్ముకోకూడదని, మంచి రేటు వచ్చిన రైతులు బహిరంగ మార్కెట్టులో అమ్ముకోవచ్చని వారి వివరాలు కూడా నమోదు చేయాలని తెలిపారు. వై.ఎస్.ఆర్. రైతు భరోసా కార్యక్రమంలో గత సంవత్సరం 3.02 లక్షల మందికి రైతు భరోసా యిచ్చామని, ఈ సంవత్సరం 5.45 లక్షలమంది నమోదు చేసుకొన్నారని, ఈ నెల 30 తేదీ నాటికి వాటి పరిశీలన పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చూడాలన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకొని త్వరితగతిన పనిని పూర్తిచేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు గురించి సమీక్షిస్తూ మూడు విడతలలో మంజూరైన కార్యాలయాలను ఈ నెల 29 తేదీనాటికి సిద్దం చేయాలని తెలిపారు. యింకను పూర్తి కావలసిన రైతు భరోసా కేంద్రాల పనులను పంచాయతీ రాజ్ శాఖ కు అప్పిగించవలసినదిగా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఇ, పంచాయతీ రాజ్, జాయింటు డైరెక్టరు వ్యవసాయశాఖ, సహాయ సంచాలకులు ఉద్యానవనశాఖ, పౌర సరఫరాల జిల్లామేనేజరు, ఇతర అధికారులు హాజరైనారు.