రాజధాని ప్రాంతంలో  పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వొద్దా?

 


    రాజధాని ప్రాంతంలో  పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వొద్దా?  : పార్టీ అధికార ప్రతినిధి, ఎంఎల్‌ఏ అంబటి రాంబాబు 


గుంటూరు/ తాడేపల్లి, (నిఘా ప్రతినిధి): నిరుపేదల గడప వద్దకే సంక్షేమ ఫలాలను అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు నెల మొదటి రోజు రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, తదితర పింఛను దారులకు పింఛన్లను అంద జేసిన విధానం అద్భుత ఫలితాలను అందించింది.ఇవాళ నెల మొదటి రోజు ఆదివారం. సెలవు రోజు. పింఛన్‌దారులకు ఆదుకునేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్ఃరెడ్డి ముందుస్తు ఏరాట్లు చేయడం వల్ల సూర్యోదయం కాకముందే గ్రామ వలంటీర్లు నిరుపేదలైన  పింఛన్‌దారులకు పింఛన్‌ అందించారు. ఇంటి వద్దే పింఛన్లను చెల్లించడాన్ని చూసి నిరుపేదలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  


గతంలో పింఛన్‌  కోసం పడిగాపులు కాసే దుస్థితి ఉండేది. ఉదయం నుంచి సాయంత్రం దాకా వేచినా పింఛన్‌ దొరికేది కాదు. వారం నుంచి పది రోజుల పాటు పింఛన్ల పంపిణీ చేసే విధానం గతంలో అమలు అయ్యింది. పాత విధానం వల్ల నిరుపేదలు ఎంతో ఇబ్బంది పడేవారు. 
వైయస్సార్‌సీపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా పింఛన్లను పింఛన్‌దారుల ఇళ్ళ వద్దే వెళ్ళి వలంటీర్లు అంద జేసే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాయాలు, వలంటీర్ల వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల ఈ సౌకర్యం  ఏర్పడింది.. 


మొదటి రోజు పింఛన్ల పంపిణీ కార్యక్రమం అమలును సీఎంవో తో పాటు ఎంఎల్‌ఏలు పర్యవేక్షించారు. గంటగంటకు పంపిణీ కార్యక్రమం ఏ విధంగా అమలు జరిగిందన్న  సమాచారాన్ని రాబట్టారు.  సుమారు 60 లక్షల మంది నిరుపేదలకు పింఛన్‌ అందించాల్సి ఉండగా  ఉదయం ఏడింటికి 11 శాతం , ఎనిమిదింటికి 26 లక్షలు, తొమ్మిది గంటలకు 31 లక్షలు, పది గంటలకు 37 లక్షలు, 11 గంటలకు 41 లక్షలు, 12 గంటలకు 43 లక్షలు, ఒంటి గంటలకు 45.5 లక్షలు, రెండు గంటలకు 80 శాతం పింఛన్‌దారులకు పింఛన్లను అందించడం జరిగింది.


పింఛన్‌ పథకం కోసం నెలకు రూ 1,384 కోట్ల చొప్పున ప్రభుత్వం వెచ్చిస్తోంది. ముందస్తు ఏర్పాట్లు చేయడం మూలాన ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నాయకత్వంలో జరిగిన మొదటి ఘట్టమిది. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అనేకం మున్ముందు అమలు కానున్నాయి.కాంగ్రెస్‌ హయాంలో  నెలసరి పింఛన్‌ కేవలం రూ 200 ఉండేది. చంద్రబాబు పింఛన్‌ను రూ వెయ్యికి పెంచారు. ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్న శ్రీ వైయస్‌ జగన్‌ పింఛన్‌ను రూ 2 వేల కు పెంచుతామని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. ఇది గమనించి చంద్రబాబు పింఛన్‌ను రూ 2 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు ప్రకటించే అవకాశం ఉన్నదని, ఇదే గనక జరిగితే నెలసరి పింఛన్ను రూ 2 వేల నుంచి రూ 3 వేలకు దశల వారీగా పెంచుతామని శ్రీ జగన్‌  గతంలో ప్రకటించారు. ప్రస్తుతం నెలసరి పింఛన్‌ రూ 2,250 అందిస్తున్నామని, దీన్ని వచ్చే నాలుగేళ్ళ లో రూ 3 వేల కు పెంచుకుంటూ పోతాం అని అంబటి రాంబాబు  తెలిపారు.


పింఛన్ల పథకం అమలులో అవినీతికి తావీయకుండా, పింఛన్‌దారులు అవస్థ పడకుండా వలంటీర్లు్ల వారి గుమ్మాల దగ్గరకు వెళ్ళి పింఛన్‌ మొత్తాలను అంద జేశారు. తద్వారా ప్రజలకు ప్రభుత్వం మరింత చేరువ అయ్యింది. ఈ విషయంలో మా ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు రంధ్రాన్వేషణలో ఉన్నారు. 


దేశంలోనే నంబర్‌వన్‌ పారిశ్రామికవేత్తగా పేరుపొందిన ముఖేష్‌ అంబానీ, ఆయన పుత్రుడు అనంత్  ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌తో సమావేశమై పెట్టుబడుల మళ్ళింపు గురించి చర్చించారు. రాష్ట్ర్రంలో పారిశ్రామికాభివృద్దికి, విద్య, వైద్య రంగాలలో పెట్టుబడులు పెడతామని వారు ముందుకు వచ్చారు. ముఖేష్‌  అంబానీతో జరిగిన చర్చలు రాష్ట్రానికి శుభ సూచకం అయితే చంద్రబాబు కువిమర్శలు చేస్తున్నారు.


చంద్రబాబు దుష్ప్రచారం


రాష్ట్రం నుంచి భారీ పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలి òపోతున్నాయని, చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. కియా పరిశ్రమ కూడా వెళ్లిపోతోందని తప్పుడు వార్తలు రాయించారు. పారిశ్రామికరంగంలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రిగా శ్రీ జగన్‌ కొనసాగడం వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్నాయని, తాను గనక ఉండే పెట్టుబడిదారులు రాష్ట్రానికి క్యూ కట్టేవారని చంద్రబాబు చెబుతున్నారు. 


 పరిశ్రమల కోసం పెట్టుబడిదారులను స్వాగతిస్తోన్న ముఖ్యమంత్రి ఆదిశగా అనేక చర్యలు తీసుకుంటుంటే , ముఖేష్‌ అంబానీతో చర్చలెందుకు?  చర్చల సారాంశం ఏమిటి? టీ ఎందుకిచ్చారు? శాలువెందుకు కప్పారు? అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మా ప్రభుత్వంపై విçషాన్ని కక్కుతున్నారు. అంబానీ సన్నిహతుడికి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలని తప్పు దారి పట్టించేప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు మరుగున పడేందుకు బూటకపు మాటలు మాట్లాడుతున్నారు. అవాకులు చెవాకులు పేలుతున్నారు. విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలను రగిలిస్తున్నారు. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. 


రాజధాని ప్రాంతంలో  పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వొద్దా?


అమరావతి రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇంటి పట్టాలిస్తామంటే టీడీపీ నేతలకు కడుపు మంటగా ఉంది. ఆ విధంగా చేయడానికి వీల్లేదని అంటున్నారు. డెమొగ్రాఫిక్‌  ఇంబ్యాలెన్స్‌ అవుతుందని అంటున్నారు. రాజధాని ప్రాంతలో మీ వర్గం వారే ఉండాలా? నిరుపేదలు ఉండరాదా?  చంద్రబాబు పేదలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇంగ్లీషు ను ప్రవేశపెడతామంటే వద్దంటున్నారు.పేద విద్యార్తులకు ఇంగ్లీషు వద్దంటున్నారు చంద్రబాబు.


నిరుపేదలను ఆదుకునేందుకు మా ప్రభుత్వం ఉగాది పర్వ దినాన
25 లక్షల ఇంటి పట్టాలను పంపిణీ చేయనుంది. అందుకు యుద్ధ ప్రాతిపదికపై కసరత్తు జరుగుతోంది. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇంటి పట్టాలు వద్దంటున్నారు టీడీపీ నేతలు. ఇంటి పట్టాలివ్వాలని ఎంతో కాలంగా కమ్యూనిష్టులు పోరాడుతోంది. ఆ పని మా పార్టీయే చేస్తోంది. 


టీడీపీ దౌర్జన్యకాండద 


రాజధాని ప్రాంతంలో ఉద్యమంపేరిట కానిస్టేబుల్‌పై దౌర్జన్యం చేశారు. వైయస్సార్‌సీపీ ఎంపీ, ఎంఎల్‌ఏపై దాడులు చేశారు. మాపార్టీ ఎంఎల్‌ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారును ధ్వంసం చేశారు. గన్‌మన్లను కొట్టారు. ఈ దౌర్జన్య కాండకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. విశాఖలో హింసను ప్రేరేపించేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. సంఘ విద్రోహశక్తిగా మారి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.