తప్పుడు ప్రకటనలు ఇస్తే సంబందిత శాఖా అధికారులపై లీగల్ చర్యలు తప్పవు: కళా వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి,( నిఘా ప్రతినిధి): పించన్లపై వైసీపీ తప్పుడు ప్రచారం, అబద్దపు ప్రచారాశనికి ప్రజాధనం దుర్వినియోగం చేయటం సిగ్గుచేటు.తప్పుడు ప్రకటనలు ఇస్తే సంబందిత శాఖా అధికారులపై లీగల్ చర్యలు తప్పవు.టీడీపీ ప్రభుత్వం డయాలసిస్, పేషెంట్లకు నెలకు రూ. 2,500 అందిస్తే నిన్న ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలో నిల్ అని చూపించారు.రూ. 200 పించన్ ని రూ. 2 వేలు చేసిన ఘనత టీడీపీదేరూ. 3 వేలు ఇస్తామని కేవలం రూ. 250 పెంచి వృద్దులను జగన్ మోసం చేశారు. మాట తప్పటం, మడమ తిప్పటం వైసీపీకి పుట్టుకతో వచ్చిన గుణం. పించన్ల లబ్దిదారులను 54 లక్షలకు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. 7 లక్షల మంది పించన్లు తొలగించి వారి ఉసురు పోసుకున్నారు. 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు పించన్ ఇస్తామని నమ్మంచి వారిని వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. తక్షణమే తొలగించిన పించన్లు పునరుద్దరించాలి.టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న తప్పడు ప్రచారానికి స్వస్తి చెప్పాలి.లేని పక్షంలో ప్రజా క్షేత్రంలో తగిన మూల్యం చెల్లించక తప్పదు.
తప్పుడు ప్రకటనలు ఇస్తే సంబందిత శాఖా అధికారులపై లీగల్ చర్యలు తప్పవు