సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించానని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌



పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించానని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. 

రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పవన్​ కల్యాణ్​ పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లోకి క్రిమినల్స్‌ వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఘటనలన్నీ చూసే పార్టీ పెట్టాల్సి వచ్చిందన్నారు. భయపెట్టే పరిస్థితులను ఎదిరించి ముందుకెళ్తున్నానని తెలిపారు.ఓటమిని ఎదుర్కొని ముందుకెళ్తేనే గెలుపు సాధ్యమని పవన్‌కల్యాణ్‌ అన్నారు. నిలబడి పోరాటం చేయాలంటే ధైర్యం ఉండాలన్నారు. పిరికివాళ్లు తనకు అవసరం లేదని.. గుండె ధైర్యం ఉన్నవాళ్లే కావాలన్నారు.కత్తులు తీసుకుని తిరగటం కాదని...ధైర్యంగా మనోభావాలను వ్యక్తీకరించాలని సూచించారు