ఇంటివద్దకే పెన్షన్ల పంపిణీలో ఏపీ సర్కార్ రికార్డు
అమరావతి: మధ్యాహ్నం 2 గంటలకు 47 లక్షల పెన్షన్లు పంపిణీ, 80శాతం పూర్తి సత్తాచాటిన వాలంటీర్ల వ్యవస్థ
అవినీతికి, పక్షపాతానికి తావులేకుండా గడపవద్దకే పెన్షన్లు
మొదటి తారీఖునే గడపవద్దకే పెన్షన్లు దాదాపుగా పూర్తికావాలని సీఎం ఆదేశాలు
సీఎం ఆదేశాలతో పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు
పొద్దు పొడవకముందే పెన్షన్ల పంపిణీ ప్రారంభం
ఇంటివద్దకే వాలంటీర్లు, లబ్ధిదారుల చేతిలో నగదు
పెన్షన్లకోసం పడిగాపులు, క్యూలైన్లు, అలసత్వానికి పూర్తిస్థాయిలో చెక్
మారుమూల ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీపై ముందస్తు సన్నాహాలు
ఒకటోతేదీ ఆదివారమైనా లబ్ధిదారులకు అందిన నగదు
గడపవద్దకే పెన్షన్లు సందర్భంగా తొలినెల(ఫిబ్రవరి–2020)లో ఎదురైన సమస్యలకు చెక్
అర్హులై గత వారం అందనివారికి, వెరిఫికేషన్ పూరై్తన వారికి ఒకేసారి 2 నెలల మొత్తం రూ.4,500 ఒకేసారి
పెన్షన్ల పంపిణీపై రియల్ టైం డేటా
జిల్లాల్లో ప్రత్యేక సెల్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ
క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రికార్యదర్శులు, కలెక్టర్లు, ఇతర అధికారుల పర్యవేక్షణ
అమరావతి: గడపవద్దకే సంక్షేమ పథకాలను అందించే మార్గంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. సామాజిక భద్రతా పెన్షన్లే కాకుండా వివిధ రోగాలతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చరిత్రలో ఉన్నడూలేని విధంగా శరవేగంగా జరిగింది. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా ఏర్పాటుచేసిన వాలంటీర్ల వ్యవస్థ సంకల్పంతో ముందుకు సాగింది. నెలలో మొదటి రోజునే పెన్షన్ల పంపిణీ పూర్తిచేయాలంటూ సమీక్షా సమావేశాల్లో సీఎం శ్రీ జగన్ స్పష్టంచేయడంతో ఆలక్ష్యాన్ని అందుకోవడానికి ఇవాళ అ«ధికార యంత్రాంగం, వాలంటీర్ల వ్యవస్థ గట్టిగా పనిచేసింది.
పొద్దు పొడవకముందే వాలంటీర్ల లబ్ధిదారుల గడపవద్దకు చేరుకుని వారిచేతిలో నగదు పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు నాటికే 80శాతం పెన్షన్లు పంపిణీకావడం దీనికి నిదర్శనం. అవినీతికి, పక్షపాతానికి తావులేకుండా లబ్ధిదారులకు చేతికే నగదు అందింది.
పెన్షన్లు పెంపు తొలి అడుగు:
ఎన్నికల ప్రణాళికలో భాగంగా అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు ఏటా పెంచుకుంటూ రూ.3వేలు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచిన తొలినెలనుంచే అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‌ను రూ. 2250కు పెంచారు, అర్హత వయస్సును 65 సంవత్సరాలనుంచి 60 సంవత్సరాలకు తగ్గించారు. 2019 , ఫిబ్రవరి 1 వరకూ అందే పెన్షన్ కేవలం 1000లు మాత్రమే. తీవ్రరోగాలతో బాధపడుతున్నవారిక్కూడా కొత్తగా పెన్షన్లుమంజూరు చేశారు. ఈ కేటగిరీ కింద రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ అందిస్తున్నారు. లెప్రసీ పేషెంట్లకు నెలకు రూ. 3వేల చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. ఈనెల గణాంకాలను చూస్తే.. సుమారు 60 లక్షలమంది సామాజిక భద్రత సహా వివిధ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు.
తొలిరోజే పంపిణీ:
అవినీతి లేకుండా వివక్ష లేకుండా అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయడమే కాదు..., వారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచి, నిరంతర సామాజిక తనిఖీ ద్వార తుది జాబితాలను అత్యంత పారదర్శక విధానంలో రూపొందించారు. అర్హుల ఎంపికలో అత్యంత పారదర్శత, విప్లవాత్మక విధానాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం, పంపిణీలో కూడా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పెన్షన్లకోసం అవ్వాతాతలు బారులుతీరి వేచిచూసిన గత కాలానికి భిన్నంగా వారి ఇంటికే వచ్చి, వారి గడపవద్దనే వాలంటీర్ల ద్వారా పంíపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత నెల ఫిబ్రవరి నుంచి దేశంలో తొలిసారిగా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెలలో దాదాపు 60 లక్షల మందికి పెన్షన్ల కింద రూ. 1,384 కోట్లు పంపిణీ విడుదలచేయగా, 2019 జనవరిలో పెన్షన్ల మొత్తం రూ. 490 కోట్లు మాత్రమే.
గతంలో పెన్షన్ల పంపిణీకోసం 7 నుంచి 10 రోజులు పట్టేది. ఇందులో తొలిరోజున అందించే పెన్షన్లు సరాసరి 35శాతం ఉండేది. నెట్ వర్క్ సమస్యలున్నచోట, మారుమూల ప్రాంతాల్లో పెన్షన్లు తీసుకోవడానికి అవ్వాతాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈసమస్యలన్నింటికీ ముగింపు పలుకుతూ, కొత్తగా ఏర్పాటుచేసిన వాలంటీర్ల వ్యవస్థను చైతన్య పరుస్తూ గడపవద్దకే పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో విజయవంతంగా నిర్వహించింది. మొదటినెల పంపిణీ సందర్భంగా గుర్తించిన సమస్యలనుకూడా ఈ నెలలో సరిచేయడంతో వేగం పెరిగింది.
పటిష్టమైన యంత్రాంగం:
వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లలో ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. వేలిముద్రలేదా, ఐరిస్ లేదా ఫేస్ రికగ్నైజేషన్.. ఇలా పలు ప్రత్యామ్నాయ విధానాల్లో అర్హులను డిజిటల్ పద్దతుల్లో గుర్తించే విధానాలను తీసుకు వచ్చారు.
మొదటి తారీఖు ఆదివారం వస్తుందనే విషయాన్ని ముందుగానే గుర్తించి ఆమేరకు నగదును సిద్ధంచేసి వాలంటీర్లకు పంపించారు.
వాలంటీర్లకు కల్పించిన అవగాహనæ తరగతులు, శిక్షణ కారణంగా వారు మరింత చైతన్యవంతంగా, ఉత్సాహంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పనిచేశారు.
పనివేళలతో సంబంధం లేకుండా పొద్దుపొడవకముందే.. పెన్షన్ల పంపిణీని మొదలుపెట్టారు.
వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత వారు ఏయే కుటుంబాలకు బాధ్యులో డిజిటల్ మ్యాపింగ్ చేశారు. దీనివల్ల ఎక్కడైనా ఆలస్యం జరిగినా వెంటనే అధికారులు అప్రమత్తంచేశారు.
జిల్లాల్లో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటుచేసుకుని అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేశారు. రియల్‌టైం డేటా పర్యవేక్షణతో సమస్యలను వెనువెంటనే పరిష్కరించారు.
ఈ విధంగా పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు కావడంతో పొద్దు పొడవకముందే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అత్యంత శరవేగంగా ముందుకు సాగింది.
సత్తా చాటిన వాలంటీర్లు ... పంపిణీలో వేగం :
దాదాపు 60 లక్షల పెన్షన్లలో
ఉదయం 8 గంటలకే 26,20,673
ఉదయం 9 గంటలకు 31లక్షలు
ఉదయం 10 గంటలకు 37.5 లక్షలు
ఉదయం 11 గటలకు 41.12 లక్షల
మధ్యాహ్నం 12 గంటలకు 43.9 లక్షలు
మ«ధ్యాహ్నం 1 గంటకు 45.24 లక్షలు పంపిణీచేశారు
మధ్యాహ్నం 2 గంటలకు 80శాతానికి పైగా పూర్తయ్యింది.
పెన్షన్లు పంపిణీలో వాలంటీర్లు అంకిత భావాన్ని చూపారు. తొలిరోజే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకు సాగారు. లబ్ధిదారులు ఇంట్లో లేకపోతే ఉన్నచోటకే వెళ్లి అందించారు. కొన్ని జిల్లాల్లో అనారోగ్యం బాధపడుతున్న వయోవృద్ధులు ఆస్పత్రిలో ఉంటే.. అక్కడికే వెళ్లి అందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పెన్షన్ల పంపిణీని పరిశీలించారు.